Natyam ad

నిన్నొదలా.. అంటున్న పాల్

హైదరాబాద్


కేఏ పాల్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. ఆయన మాటను ఎవరూ కాదనరు. ఎందుకంటే అసలుపట్టించుకోనే  కోరు కనుక. వరుస పెట్టి అందర్నీ ఆయన కలిసేస్తూ ఉంటారు. అమిత్ షా అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా ఇలా ఎవరైనా సరే ఆయన కలుస్తానంటే వద్దని అనరు ఎందుకొచ్చిన గొడవ ఆయన చెప్పేదేదో చెప్పనిచ్చి పంపిస్తే పోలా  అనుకుంటారు.ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి భరతం పడతానంటున్నారు. ఇందు కోసం ఆయన సీబీఐకి కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిపై ఫిర్యాదు చేశారు. వాళ్లకీ, వీళ్లకీ కాదు.. ఏకంగా సీబీఐ డెరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు. ఇందుకోసం ఆయన స్వయంగా ఢిల్లీలో సుభోద్ కుమార్ జైశ్వాల్ అప్పాయింట్ మెంట్ తీసుకుని (పాల్ కోరితే అప్పాయింట్ మెంట్ ఇవ్వని వారెవరుంటారు.. అది వేరే సంగతి) మరీ కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం ఏకంగా 9లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనీ, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి, ఇంతటి అవినీతిని తాను చూడలేదనీ ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎందుకంటే కేఏ పాల్ ప్రపంచం చుట్టి వచ్చిన వీరుడు కదా. ఎక్కడా కనని, వినని అవినీతి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని, వెంటనే విచారణ జరిపించాలనీ ఆయన ఫిర్యాదు సారాంశం. ఇది తన ఒక్కడి మాటే కాదనీ యావత్ తెలంగాణ ప్రజా కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిన అవినీతిపై విచారణ జరగాలని కోరుకుంటోందని సెలవిచ్చారాయన.చర్విత చరణమే అయినా ఆయన బీజేపీ చేసిన, చేస్తున్న ఆరోపణలనే సీబీఐకు ఫిర్యాదు రూపంలో ఇచ్చారు. రాష్ట్ర విభజనతో 60వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిందన్నారు.

 

 

 

రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేసీఆర్ కుటుంబ అవినీతికి ఆకాసమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ సహా సింగపూర్ దుబాయ్, అమెరికాలలో కూడా ఆ కుటుంబం ఆస్తులు కూడబెట్టిందని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5వేల కోట్ల రూపాయలైతే కేవలం 35 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేశారని, ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 75 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.యాదాద్రి విషయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని సమగ్ర విచారణ జరిపితే అన్నీ బయటకు వస్తాయనీ పాల్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశారు కనుక ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభిస్తుందా.. లేక ఓ కమేడియన్ పొలిటీషియన్ ఫిర్యాదు చేశారని నవ్వుకుని వదిలేస్తుందా అన్నది చూడాలి. సీబీఐ ఏ దర్యాప్తునూ తనంత తానుగా చేపట్టదు కనుక పాల్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు కదులుతుందని భావించలేం. వార్తల్లో నిలవడానికి ఇదో మార్గంగా ఎంచుకుని పాల్ సీబీఐ డైరెక్టర్ ను కలిసి హడావుడి చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తునకు తాను పూర్తి సహకారం అందిస్తాననీ పాల్ సీబీఐ డైరెక్టర్ కు హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణలో తనపై దాడులు జరుగుతున్నాయని పాల్ సీబీఐ డైరెక్టర్ కు విన్నవించారు. తన ఫిర్యాదు కాపీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం పంపారు.

 

Post Midle

Tags: Like you .. Paul says

Post Midle