సంక్షోభంలో సున్నపురాయి బట్టీలు

Limestone kilts in crisis

Limestone kilts in crisis

Date:14/01/2019
గుంటూరు ముచ్చట్లు:
పిడుగులకు బదులు రాళ్లు కురిసిన ఊరది. ప్రస్తుతం పల్నాడులోనే పెద్ద వాణిజ్య నగరం… మినీ ముంబయిగా పిలుచుకునే లైమ్ సిటీ. పల్నాడు ప్రాంతంలో కీలక పట్టణం. అంత పేరున్న ఆ పట్టణంకు అంత గుర్తింపు తెచ్చింది మాత్రం అక్కడి సున్నపురాయి నిక్షేపాలే.  లఘు పరిశ్రమగా పేరు గాంచిన సున్నపురాయి బట్టీలు నేడు తీవ్ర సంక్షోభంలో పడింది. ఒక నాటి సున్నపు తెల్లని వెలుగు..నేడు బొగ్గుతో నల్లగా మసకబారింది.  కారణం ఏంటో మీరు చూడండి. కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా అసహజంగా అక్కడ మాత్రం పిడుగులు పడినప్పుడు వడగళ్ళు కాకుండా చిన్నచిన్న రాళ్ళు కురిశాయి.  ప్రపంచంలో ఎప్పుడూ.. ఇంకెక్కడా.. ఇలా జరగలేదట!. దాంతో ఈ ప్రాంతాన్ని పిడుగురాళ్ళు అని పిలిచేవారు. ప్రస్తుతం పిడుగురాళ్ళగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి ఒకప్పుడు గురజాల కేరాఫ్ ఉండేది.
అప్పటికి రెవెన్యూలో గురజాల కింద ఉన్న చిన్న ఊరే నేటి పిడుగురాళ్ల.  కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్సయ్యింది.  ఎంతగా అంటే పిడుగురాళ్ల పట్టణంలోని ఓ భాగం అంత గురజాల ఉంటుంది.. అంటే అశ్చర్యం కలిగించే అంతగా పిడుగురాళ్ల పెరిగిపోయింది. పిడుగురాళ్ల అంతగా అబివృద్ది చెందడానికి కారణం పిడుగురాళ్ల చుట్టుపక్కల ఉన్న సున్నపురాయి నిక్షేపాలు. దీనివల్ల వందల కొద్ది సున్నపు బట్టీలు ఏర్పడడంతో వేల సంఖ్యలో కార్మికులకు ఉపాధి దొరికింది. ఉపాధి పెరగటంతో జనం సంఖ్య పెరిగింది. చుట్టు పక్కల  వాళ్ళు పిడుగురాళ్ల వచ్చి స్థిరపడటం పిడుగురాళ్ల పట్టణంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి ఓ వెలుగు వెలిగిన ఇక్కడి సున్నపురాయి పరిశ్రమ ఇప్పుడు మాత్రం సంక్షోభంలో నిలిచింది.  ఇక్కడ సున్నపురాయి పరిశ్రమలో ఎక్కువగా సున్నపురాయిని కాల్చడానికి ఉపయోగించే బొగ్గు ధర విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పరిశ్రమలు నడపడానికి వాటి నిర్వహకులు వెనుకంజ వేస్తున్నారు.
దక్షిణాదిలొనే నాణ్యమైన సున్నపురాయి నిక్షేపాలుకు చిరునామా పిడుగురాళ్ల.  ఇంటి పైకప్పులపై వేసే వైట్ సిమెంట్స్ ఉక్కు, ఫార్మా, పంచదార,  తోళ్ళు వివిధ పరిశ్రమలకు కావలిసిన సున్నం పిడుగురాళ్ల ప్రాంతంలోని బట్టిల్లోనే తయారువుతుంది. లఘు పరిశ్రమగా పేరు గాంచిన పిడుగురాళ్ల సున్నపురాయి భట్టిలు ఇప్పుడు బొగ్గు రేటు పెరగడంతో రేట్లు పెరగడం, అమ్మకాలకు రేట్లు పెంచడంతో సున్నం నిల్వలు పెరిగి, నష్టాలు చూస్తున్నారు బట్టీల నిర్వహకులు.  పిడుగురాళ్ల లో ఒకప్పుడు 150 బట్టీల్లో సున్నపు రాయిని కాల్చేవారు. బొగ్గు రేటు సంక్షోభంతో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుతం  40 నుంచి 50 బట్టీల్లోనే ఉత్పత్తి జరుగుతోంది.దాదాపు 30వేల మందికి ఉపాధి కలిపిస్తున్న సున్నపు బట్టీల పరిశ్రమల్లో బొగ్గు రేటు సంక్షోభం, రవాణాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బట్టీల యజమానులతో పాటు, ఉపాధి పొందుతున్న కార్మికులు కోరుతున్నారు.
Tags:Limestone kilts in crisis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *