లైన్ మ్యాన్ సుబ్రహ్మణ్యం యాదవ్ మోసంపై విజిలెన్స్ అధికారుల విచారణ
రామసముద్రం ముచ్చట్లు:
లైన్ మ్యాన్ మోసం చేశారని రైతులు విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేయడంతో మంగళవారం అధికార బృందం విచారణ చేపట్టారు. మండలంలోని పెద్ద కుర్రపల్లి, పై గడ్డ,నారేవారిపల్లె వివిధ రైతుల వద్ద ట్రాన్స్ఫార్మర్స్ మరియు అడిషనల్ లోడ్ ఇప్పిస్తానంటూ లైన్ మ్యాన్ సుబ్రహ్మణ్యం యాదవ్ కంతుల వారిగా లక్షల రూపాయల డబ్బు తీసుకొని మోసం చేశాడని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడూ నెలలు ముందు సర్వీస్ దరఖాస్తు లేకపోయిన అక్రమంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయిస్తానని రైతులకు మాయమాటలు చెప్పి వారివద్ద నుండి యాబై వేలు, పదివేలు అంటూ సుమారు ఇరవై నుండి ముప్పై మంది రైతుల వద్ద లక్షలాది రూపాయలు వసూలుకు పాల్పడ్డాడు. ఒకరికొకరు పనులు కాలేదని లైన్ మ్యాన్ ను నిలదీయడం తో పాటు సంబంధిత విషయం ను ఎల్ ఐ మధుసూదన్, ఏఇ.హరిప్రసాద్, పుంగనూరు ఏడిఇ రవికుమార్ లకు పలుమార్లు రైతుల పిర్యాదులు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫిర్యాదు మేరకు వెంటనే అధికారులు లైన్ మ్యాన్ సుబ్రమణ్యం ను మదనపల్లెకు బదిలీ చేశారు.విద్యుత్ లైన్ మ్యాన్ సుబ్రహ్మణ్యంను గత ఏడూ నెలల క్రితం బదిలీ అయిన రోజు నుండి రైతులకు చెల్లిస్తానన్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో రైతులు విజిలెన్స్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం లైన్ మ్యాన్ సుబ్రహ్మణ్యం యాదవ్ ను విజిలెన్స్ విచారణ కమిటీ అధికారి రమేష్ విచారణ జరిపి తదనంతరం శాఖ పరమైన చర్యలు తీసుకొంటారని తెలిపారు.

Tags: Lineman Subrahmanyam Yadav’s fraud probed by vigilance officials
