తెలంగాణ పాలిటిక్స్ అన్నీ దుబ్బాకకి లింక్

Date:26/10/2020

మెదక్ ముచ్చట్లు:

దుబ్బాక దుబ్బాక దుబ్బాక‌. తెలంగాణ పాలిటిక్స్ అన్నీ దుబ్బాకకి లింక్ అయ్యి తిరుగుతున్నాయి. అన్ని పార్టీలూ సీరియ‌స్ గా తీసుకున్నాయి. ఇక్క‌డ ఓడిపోతే ఇజ్జ‌త్ మే స‌వాల్ అంటున్నారు లీడ‌ర్లు. ఓడిపోవ‌డ‌మే కాదు. ఒక్కో ఓటు లెక్కే. ఓటు ఓటునీ కౌంట్ చేస్తూ క‌రెన్సీ క‌ట్ట‌లు కురిపిస్తున్నార‌ట‌. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడ‌దు అని లెక్క‌లేస్తున్నాయ‌ట పార్టీలు. అన్నొస్త‌య్ ఇన్నొస్త‌య్ అని లైట్ తీసుకోకుండా.. సీరియ‌స్ గా కౌంటింగ్స్ లోకి వెళ్తూ.. క‌రెన్సీ క‌ట్ట‌ల‌తో బ్యాగులు రెడీ చేస్తున్నార‌ట‌. ఎల‌క్ష‌న్ల‌కి రెండు రోజుల ముందు ల‌క్ష్మీ దేవి మొత్తాన్ని టేకోవ‌ర్ చేయ‌బోతుంద‌ని టాక్. ఆల్రెడీ వ‌ర్గాల వారీగా బ్యారాలు న‌డుస్తున్నాయ‌ట‌. ద‌స‌రా గిస‌రా అని  ఏం చూడ‌ట్లేదు లీడ‌ర్లు. ఇది కూడా ఓ విధంగా క‌లిసొస్తుందంట‌. అంద‌రూ గుంపులుగా క‌ల‌వ‌డం.. పండ‌గ సంద‌ర్భంగా  మాట్లాడుకోవ‌డం.. ఇదే టైంలో బ్యారాలు కూడా తెగ్గొడుతున్నార‌ట‌. మీ వ‌ర్గానికి అన్ని ఓట్లున్న‌య్ ఆ వ‌ర్గానికి ఇన్ని ఓట్లున్న‌య్.. అక్క‌డ అది చేస్తం ఇక్క‌డ ఇది చేస్తం. ఇన్ని డ‌బ్బులిస్తం అలా చేస్కోండి అన్ని డ‌బ్బులిస్తం ఇలా చేస్కోండి అని పార్టీలు కొనేస్తున్నాయ‌ట‌.

 

 

పండ‌గ పూట మంచి  మాట‌లు మాట్లాడుకుందాం. మీది ఏ పార్టీ అయినా ఈ ఒక్క‌సారికి మ‌ర్చిపోండి. మా పార్టీకే ఓటేయండి అని అన్ని పార్టీలూ రిక్వ‌స్టులు చేస్తున్నాయ‌ట‌. కొన్ని చోట్ల‌నైతే లోక‌ల్ లీడ‌ర్లు బెదిరింపుల‌కి కూడా దిగుతున్నార‌ట‌. గెలిచిన త‌ర్వాత మీకుందే అంటున్నార‌ట‌. డ‌బ్బుల‌తో ప్ర‌లోభ పెట్ట‌డం.. అంగ‌, అధికార బ‌లంతో బెదిరించ‌డం అన్నీ న‌డుస్తున్నాయ‌ట‌. ఇక పార్టీల‌కి కూడా వేరే చోట ఎల‌క్ష‌న్ లేక‌పోవ‌డం.  సీనియ‌ర్ లీడ‌ర్లు.. రెస్పాన్సిబులిటీ ఉన్న లీడ‌ర్లు ఫుల్లుగా ఫోక‌స్ చేయ‌డంతో ర‌స‌వ‌త్త‌రంగా  మారింది ఎవ్వారం. రూలింగ్ పార్టీని ఓడిస్తేనే దారికొస్తారు. లేదంటే హామీలు మ‌ర్చిపోతారు అని అపొనెంట్ పార్టీలు. రూలింగ్ లో ఉన్న పార్టీని గెలిపించి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగు చేసుకోవాల‌ని వీళ్లు. అంద‌రూ ఎవ‌రి ప్ర‌చారాల్లో వాళ్లున్నారు. ఈ సాయంత్రానికి చాలా చోట్లకి ఎర్ర‌కాయితాల బ్యాగులు ట్రాన్స్ పోర్ట్ అవుతున్నాయ‌నేది టాక్.

ములుగు జిల్లాలో  రెండోసారి అలజడి

Tags: Link to all the politics of Telangana Dubbakaki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *