పుంగనూరులో లయన్స్ క్లబ్ కంటి వైద్యశిబిరం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. క్లబ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ, డాక్టర్ సరళ, క్లబ్ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల వారిచే వైద్యశిబిరం నిర్వహించారు. కంటి జబ్బులు గల 75 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, 24మందికి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. డాక్టర్ శివ మాట్లాడుతూ ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలు అందిస్తామన్నారు.

Tags: Lions Club Eye Camp at Punganur
