Natyam ad

పుంగనూరులో లయన్స్ క్లబ్‌ కంటి వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. క్లబ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ పి.శివ, డాక్టర్‌ కె.సరళ, క్లబ్‌ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల వారిచే వైద్యశిబిరం నిర్వహించారు. కంటి జబ్బులు గల 100 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, 30మందికి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. డాక్టర్‌ శివ మాట్లాడుతూ ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 20 వేల మందికి ఆపరేషన్లు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ, గోపాలకృష్ణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Lions Club Eye Camp at Punganur

Post Midle