Natyam ad

పుంగనూరులో లయన్స్ క్ల బ్‌ కంటి వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. క్లబ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ, క్లబ్‌ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల వారిచే వైద్యశిబిరం నిర్వహించారు. కంటి జబ్బులు గల 104 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, 25మందికి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. డాక్టర్‌ శివ మాట్లాడుతూ ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలు అందిస్తామన్నారు. ఈ శిబిరంలో క్లబ్‌ కార్యదర్శి ఈశ్వరమ్మ, క్లబ్‌ ప్రతినిధులు ముత్యాలు, గోపాలకృష్ణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Lions Club Eye Camp at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.