పుంగనూరులో 11న లయన్స్ క్లబ్ వైద్యశిబిరం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలకు చెందిన వైద్యబృందంచే కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు చికిత్సలు చేసుకోవాలన్నారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags: Lions Club Medical Camp at Punganur on 11th
