Natyam ad

జనావాసంలో మద్యం  దుకాణాన్ని తొలగించాలి

జనావాసంలో మద్యం  దుకాణాన్ని తొలగించాలి
విజయనగరం ముచ్చట్లు:

జనాలు నివసించే ప్రాంతంలో ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఆ మద్యం దుకాణాన్ని తీసివేయాలని  జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు లోకం మాధవి కోరారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో  ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ   నెల్లిమర్ల నియోజకవర్గం అల్లాడ పాలెం గ్రామంలో జనావాసాల మధ్య ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారని దీనివల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణం తక్షణం  ఆ ప్రాంతం నుండి మార్చాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని,  చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. మద్యం దుకాణం పెట్టడమే కాకుండా అక్కడ మందు బాబులకు బెంచీలు వేసి మరి మద్యం సేవించేందుకు   ఏర్పాటు చేయడంతో  స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణం సమస్యను పరిష్కరించకపోతే గ్రామస్తులు తో కలిసి ఆందోళన  చేపడతామని తెలిపారు.

 

 

Post Midle

Tags: Liquor shop should be removed from residential areas

Post Midle