అమరావతి ముచ్చట్లు:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 7వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీబేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.గత ప్రభుత్వం తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిందని, ఇప్పుడు ఆ ఉద్యోగం పోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. నూతన మద్యం పాలసీ వస్తే 15 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతామని కాబట్టి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరారు.
Tags: Liquor shops closed in AP from September 7