పుంగనూరు మున్సిపాలిటిలో రిజర్వేషన్ల జాబితా సిద్దం

Date:18/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డుల్లోను ఎస్సీ, ఎస్టీ, బీసి, మహిళ ఓటర్ల జాబితా సిద్దం చేయాలని మున్సిపల్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాలవలవలన్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం మున్సిపాలిటిలకు ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డుల్లోను మున్సిపల్‌ ఉద్యోగులు , సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. సర్వే పూర్తి కాగానే ఆయా కేటగిరిల వివరాలతో జాబితాను జూన్‌ 1లోపు సిద్దం చేయాలి. తరువాత 2 , 3 తేదీలలో జాబితాలో బీసీలను గుర్తించాలి. 4న బీసీల జాబితాను సిద్దం చేయాలి. దీనిపై ఫిర్యాదులు , క్లెములను స్వీకరించాలి. 5 నుంచి 9 లోపు ఎస్టీ, ఎస్సీ జాబితాలపై క్లెములు, ఫిర్యాదులు స్వీకరించి, నివేదికలు సిద్దం చేయాలి. దీని ఆధారంగా 10 నుంచి 12వ తేదీలోపు వార్డుల వారిగా అన్ని కులాలకు సంబంధించి ఫిర్యాదులు, క్లెములు తీసుకుని , వాటిని పరిశీలించి, నివేదిక సిద్దం చేయాలి. 15, 16 తేదీలలో బీసీ ఓటర్లను గుర్తించి జాబితా సిద్దం చేయాలి. జూన్‌ 17 న తుది జాబితాను వార్డుల వారిగా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్‌ మదుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది , మున్సిపాలిటిలోని కులాల వారి జాబితాలను సిద్దం చేసేందుకు ఇంటింటా సర్వేలకు సిద్దమైయ్యారు. కాగా రిజర్వేషన్లు ప్రకటించేందుకు కులాల వారిగా ఓటర్ల జాబితా సిద్దం చేయాలని ఆదేశాలు అంద డంతో సిటింగ్‌ కౌన్సిలర్లకు పలువురికి రిజర్వేషన్ల ఫలితంగా టికెట్లు గల్లంతైయే అవకాశం ఏర్పడుతోందని గుసగుసలు ప్రారంభమైంది. మున్సిపల్‌ ఎన్నికల వేడి ప్రారంభమైంది.

 

అంగన్‌ వాడీ కేంద్రాలలో సామాజిక తనిఖీ

Tags: List of reservation in Punganoor municipality is ready

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *