List of voters released

కులగణన ఓటర్ల జాబితా విడుదల

Date:27/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని వెహోత్తం 31 వార్డుల్లోను కులగణన తుదిజాబితాను సోమవారం విడుదల చేసినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్‌ ఆదే శాల మేరకు మున్సిపాలిటిలో వీలీనం అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగర్‌, నక్కబండ ప్రాంతాలను కలిపి 31 వార్డులుగా విభజించడం జరిగిందన్నారు. ఈ మేరకు సరిహద్దులతో మున్సిపాలిటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల కులగణన పూర్తి చేయడం జరిగిందన్నారు. 23న జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలను కోరామన్నారు. కానీ అభ్యంతరాలు లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తుదిజాబితాను విడుదల చేయడం జరిగిందన్నారు. జాబితా మేరకు మున్సిపల్‌ ఎన్నికల పక్రియలో వార్డుల వారిగా రిజర్వేషన్ల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్‌కు జాబితా నివేదికలు పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌వో రామకృష్ణ , శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి వారదులుగా వలంటీర్లు పని చేయాలి

Tags: List of voters released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *