Listen to Minister Peddi Reddy on girls' high school repairs

బాలికల హైస్కూల్‌ మరమ్మతులపై మంత్రి పెద్దిరెడ్డికి వినతి

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జెడ్పీబాలికల హైస్కూల్‌ భవనాలను మరమ్మతులు చేయించాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పాఠశాల కమిటి సభ్యులు కోరారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌, మైనార్టీ నాయకురాలు సల్మా కలసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు పాఠశాల 1975లో ఏర్పాటైనప్పటి నుంచి పాత భవనంలో కొనసాగుతోందని, సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో ఎంపికైన హైస్కూల్‌లో మరుగుదొడ్లు నిర్మించేందుకు పాత గదులను తొలగించేలా మంత్రి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుని విద్యార్థులకు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఇఫ్తికార్‌ పాఠశాల వారికి అందజేశారు.

మారెమ్మకు ప్రత్యేక అలంకరణ

Tags: Listen to Minister Peddi Reddy on girls’ high school repairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *