ఓట్లు తొలిగింపుపై తహశీల్దార్ కు వినతిపత్రం

Date:11/02/2019
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం , అంబేద్కర్ నగర్ ,గ్రామ పంచాయతీల పరిధిలో ఓట్లు తొలిగింపు పై సర్పంచ్ లు జొన్నలగడ్డ కిరణ్ బాబు, బద్దం నిర్మల కోటిరెడ్డి,  తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవిన్స్ లో తహశీల్దార్ వెంకన్న కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిరణ్ బాబు మాట్లాడుతూ గత అసెంబ్లీ ,గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓట్లు వేసి వారిని కావాలనే కొందరు చదువు కోనే విద్యార్థులు, జీవనోపాధి కోసం వెళ్లిన వారి ఓట్లు తొలగించడం జరిగిందని అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి తప్పుడు విధానాలు అనుసరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వెంటనే మా ఓట్లు పునరుద్ధరణ చేయాలని తహశీల్దార్ ను కోరినట్లు తెలిపారు.
Tags:Listen to Tehsildar on the withdrawal of votes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *