Listen to YSSAR's assurances

వైఎస్సార్‌ భరోసాకు వినతులు

Date:09/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

మండల కేంద్రంలోని తహశీల్ధార్‌ కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌ రైతు భరోసాపై ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో రైతులు వినతులు భారీ స్థాయిలో సమర్పించారు. ఏవో మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ మండలంలోని 18 పంచాయతీలలో దాదాపు 11,438 మందికి పైగా వైఎస్సార్‌ లబ్ధిదారులు ఉండగా అందులో దాదాపు తొమ్మిదివేల మందికి వ్యైస్సార్‌ రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమకావడం జరిగిందన్నారు. మిగిలిన ఖాతాదారులు కొంత మంది మరణించగా మరి కొంత మంది ప్రజాసాధికార సర్వే చేసుకోపోగా, మరికొంత మంది ఖాతాలు సరిలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా బ్యాంకుఖాతాలో జమ చేయాలని , ఈ స్పందన కార్యక్రమంలో మరణించిన రైతు ధృవీకరణపత్రం, అఫడవిట్‌ జమ చేసి వారి కుటుంబ సభ్యుల ఆమోదంతో ఒకరికి బ్యాంకుఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే పట్టాదారు పాసుపుస్తకాల్లో ఏవైన పొరబాట్లు ఉంటే తహశీల్ధార్‌ కార్యాలయంలో సమస్యను పరిష్కరింపబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సిబ్బంది , వీఆర్‌వోలు, సచివాలయ సిబ్బంది, గ్రామవలంటీర్లు , రైతులు పాల్గొన్నారు.

 

ఏకలవ్యుని విగ్రహ ఆవిష్కరణ

 

Tags:Listen to YSSAR’s assurances

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *