సాయితత్వమే మానవాళికి  మోక్షమార్గం

-తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ

Date:15/01/2021

జగిత్యాల  ముచ్చట్లు:

సాయి తత్వమే  మానవాళికి మోక్షమార్గమని, అలాగే సాయి గురు భోదనలు సేవా మార్గాన్ని సూచించామని   తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.
సాయి గురు భోదనలే మనందరికీ సేవా మార్గాన్ని సూచించాయని, ఆధ్యాత్మిక సాధన, సేవా తత్వముతో సాటి మానవులకు మనకు తోచిన విధంగా సహాయ పడినపుడే మానవ జన్మ సార్థకమవుతుందని  రమణ అన్నారు.  సాహితీ వేదిక  సభ్యురాలు కవయిత్రి  రమాదేవి కులకర్ణి శిరిడి సాయి బాబా పై రచించిన  నిత్య పారాయణ గ్రంధం – అన్ని తెలిసిన అయ్యకు వందనం  అనే పుస్తకాన్ని ఎల్. రమణ  చేతుల మీదగా శుక్రవారం  అవిష్కరించారు. ఈసందర్బంగా  రమణ మాట్లాడుతూ ఈ  గ్రంధం సాయి భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సాయి తత్వమే మనందరికి మోక్ష మార్గనమని సూచించారు. అనంతరం  ఎల్.రమణ ను సభ్యులు  ఘనంగా సన్మానించి సాయి చిత్ర పటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జి. రాజు, ప్రముఖ కవయిత్రి అయిత అనిత, సామాజిక సేవకురాలు నమిలికొండ సాకేత, పద్మశాలి సేవా సంగం అధ్యక్షుడు వొల్లాల గాంగాధర్, నాయకులు మహాంకాళి రాజన్న,  కోరుకంటి రాము, వనమాల నిరంజన్, సిద్దు గౌడ్, గుండేటి మారుతి తదితరులు పాల్గొన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags:Literacy is the path to salvation for mankind

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *