Livestock festival

కోలాహాలంగా పశువుల పండుగ

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం కుమ్మరగుంటలో కోలాహాలంగా పశువుల పండుగను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరు ఎలాంటి పనులకు వెళ్లకుండ బంధుమిత్రులతో కాలక్షేపం చేశారు. నూతన వస్త్రాలు ధరించి పూజలు చేశారు. పశువులను , గృహాలను శుద్ధిచేశారు. పశువులకు రంగురంగుల పూలను , గంటలు, బెలూన్లు కట్టి గ్రామంలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామదేవత గంగమ్మకు పూజలు చేసి , రాత్రి కాటమరాజు ఆలయం వద్దకు పశువులను తోసుకెళ్లి జంతుబలులు సమర్పించి చిట్లాకుప్ప వెలిగించి , పశువులకు దిష్టిపరిహారం చేపట్టారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Tags: Livestock festival

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *