వేదాల ద్వారా విలువలతో కూడిన జీవనం :- ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు
తిరుపతి ముచ్చట్లు:
వేదం ప్రామాణికంగా నడుచుకుంటే నైతిక విలువలతో కూడిన జీవనం అలవడుతుందని జీవా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు తెలిపారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నానీరాజనం వేదికపై జరుగుతున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో ఆదివారం ఆయన పాల్గొన్నారు.ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు ” వేదాల్లోని పురుషార్థాలు ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, మానవాళి శ్రేయస్సు కోసమే భగవంతుడు వేదాలను సృష్టించాడని తెలియజేశారు. వేదం ధర్మ, అర్ధ, కామ, మోక్షాలను గురించి తెలుపుతుందన్నారు. మనసు, వాక్కు, కర్మ త్రికరణ శుద్ధిగా ఉండాలని చెప్పారు. సనాతన ధర్మంలో మానవులు తమ పిల్లలకు సంపాదించుకునేందుకు విద్యా బుద్ధులు నేర్పాలని, వేదాలు తెలియజేస్తున్నదన్నారు. వేదాలలో మానవులు ధర్మ బద్ధంగా ఏవిధంగా జీవించాలి అనే అంశాలు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ పాల్గొన్నారు.

Tags: Living with values through Vedas :- Acharya Samudrala Ranga Ramanujacharya
