Natyam ad

లోన్ యాప్ నిందితులు అరెస్టు

నెల్లూరు ముచ్చట్లు:

లోన్ యాప్ ల   పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసారు.  తెలంగాణ రాష్ర్టం తో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన   నలుగురిని అరెస్ట్ చేసారు. అదిలాబాద్ కి చెందిన యువరాజు అనే యువకుడి పై నెల్లూరు లోని బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. యువరాజు తో పాటు అజయ్, పవన్ కళ్యాణ్ , రాథోడ్ సాయి కిరణ్, కర్ణాటకకు చెందిన అబ్దుల్ లు మసూద్ అరెస్ట్ అయ్యారు. వీరిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్దుల్ మసూద్ అలహాబాద్ ఐఐటీ లో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరు నగరం లోని   ఆదిత్య నగర్ కి చెందిన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన  పిర్యాదు మేరకు బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు.  బాధితుడు 30 వేలు లోను తీసుకుంటే అతని ఫోటోలు మార్ఫింగ్ చేస్తామని బెదిరించి.. అతని  వద్ద నుంచి 40 లక్షలు దాకా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. – నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్  అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కోటి 20 లక్షల నగదు హోల్డ్ చెయ్యమని బ్యాంక్ లకు  అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.  హాంకాంగ్ కి చెందిన  లీసా అనే మహిళ ద్వారా ఈ మోసం జరిగిందనీ గుర్తించారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు మాట్లాడుతూ యువతనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న వివిధ ప్రాంతాలకు

 

 

 

Post Midle

చెందిన నలుగురిని అరెస్టు చేసి వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయని సైబర్  నేరగాళ్లు మొబైల్ ఫోన్లకు లింకు లు పంపుతూ వీటిని ఓపెన్ చేయడం ద్వారా లిజనింగ్ యాప్ ద్వారా మన ఫోన్లో ని డేటా తో పాటు కాంటాక్ట్ లిస్ట్ మొత్తం సైబర్ నేరగాళ్ల  కు చేరిపోతుందన దీంతో వారు ఫోటోలు మార్ఫింగ్ చేయడం,అకౌంట్ లలో నగదు దొంగిలించడం మనకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా బెదిరించడం లాంటి పనులకు పాల్పడే వారని తెలిసింది …సైబర్ నేరగాళ్లు ఓపెన్ చేసిన 29 అకౌంట్ ల ద్వారా  34 కోట్ల రూపాయాలు ను సీజ్ చేశామని …వివిధ రకాల పేర్లతో  12 కంపెనీలను ఓపెన్ చేయడం ద్వారా పలువురిని మోసం చేశారని   లీ సా అనే విదేశీ మహిళ ఫిలిప్పీన్స్ హాంకాంగ్ దేశాల ద్వారా ఇన్ స్టా గ్రామ్ అనే సోషల్ ప్లాట్ ఫారం ద్వారా  వివిధ రకాల మెసేజ్ లు పంపుతూ వర్క్ ఫ్రమ్ హోం అనే మెసేజ్ ద్వారా  ఫోన్ ను హ్యాక్ చేస్తూ, ఎస్ఎంఎస్ లిశనింగ్ ఆప్ ద్వారా మీ మొబైల్ లో ఇన్స్టాల్ అయి   ఫోన్ లోని ఫోటోలు, డేటా మొత్తం మోసగాళ్ళు చేతిలోకి వెళ్ళి పోతాయని నగరాల్లో యువత ఎక్కువ గా ఈ ముఠా బారిన పడుతున్నారని కావున పై విషయాల దృష్టిలో ఉంచుకొని యువత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు తెలియజేశారు..
ఈ సైబర్ కేసు చేధించడంలో ప్రధాన పాత్ర వహించిన నెల్లూరు జిల్లా క్రైం ఏఎస్పీ  చౌడేశ్వరి తో పాటు ఉదయగిరి సిఐ  గిరిబాబు,బాలాజీ నగర్ సిఐ రాములు నాయక్ ,సైబర్ టీం సిబ్బందికి జిల్లా ఎస్పీ విజయరావు నగదు ప్రోత్సాహకం తో పాటు ప్రశంసా పత్రాలు అందించారు.

 

Tags: Loan app accused arrested

Post Midle