Natyam ad

లోన్ యాప్ కేసు..కీలక వ్యక్తి ఆరెస్టు

కడప ముచ్చట్లు:


లోన్ యాప్ ద్వారా ప్రజలను వేధిస్తున్న కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతొంది. జిల్లా పోలీసులు రుపేస్ లోన్ యాప్ మోసాలపై దర్యాప్తును ముమ్మరం చేసారు. తీగ లాగితే డొంక కదిలినట్లు విదేశాల నుండి నడిపిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులను కనుగొన్నారు. ఇప్పటికే లోన్ యాప్ వేధింపుల కేసులో  6 మందిని చింతకొమ్మ దిన్నే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా రాజస్తాన్ కు చెందిన జాన్ యాదవ్ ను అరెస్టు చేసారు. జాన్ యాదవ్ ఇంతవరకు కొన్ని వేలమందిని వేధించి వసూలు చేసినట్లు గుర్తించారు. హాంకాంగ్ కు చెందిన వ్యక్తులు ఈ లోన్  యాప్ లో కీలకంగా వ్యవహరించిన ఉన్నట్లు  దర్యాప్తులో వెల్లడైనట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బు రాజన్ చెప్పారు. మరి కొందరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని అయన అన్నారు.

 

Tags: Loan app case..Key person arrested

Post Midle
Post Midle