విత్తనోత్పత్తికి రుణాలు : మంత్రి పోచారం

Date:13/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. బ్యాంకర్లతో మాట్లాడి వచ్చే ఖరీఫ్ లో విత్తనోత్పత్తి చెసే రైతులకు రుణాలను పెంచాలని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ, ఉధ్యాన, సహకార, విత్తనాభివృద్ది శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.మంగళవారం  శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలలో  సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి, విజీ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో విత్తనోత్పత్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి పొచారం మాట్లాడుతూ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, హాకా, నేషనల్ సీడ్ కార్పోరేషన్ ద్వారా విత్తనోత్పత్తి జరుగుతుందన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో రాష్ట్రంలో 10 విత్తనోత్పత్తి కేంద్రాలు ఉండగా, గత ప్రభుత్వాల హయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ విత్తన కేంద్రాలలో మౌళిక సదుపాయాలను పెంచి భారీ ఎత్తున విత్తనోత్పత్తిని చేపడుతున్నామన్నారు. అదేవిదంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తన గ్రామం (సీడ్ విలేజ్) కార్యక్రమం చేపట్టి రైతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.రైతులకు మూల విత్తనానాన్ని ఇచ్చి, బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా తిరిగి వారి నుండి దృవీకరణ విత్తనాలను కొనుగోలు చేస్తున్నామని మంత్రి సభకు తెలిపారు. విత్తనోత్పత్తిలొ ఆహారాధాన్యాలపై 50 శాతం, పప్పులకు అయితే 60 శాతం సబ్సిడీని కల్పిస్తున్నాం. పసుపులో అధిక ఉత్పత్తి కోసం ప్రభుత్వం నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతులకు అందిస్తున్నాం. గత ఏడాది రెండు బస్సులలో రైతులను తమిళనాడులోని సేలం కు తీసుకువెళ్ళి అధిక దిగుబడినిచ్చే వంగడాలను చూపించడంతో పాటు ఆధునిక సాగు పద్దతులపై రైతులకు అవగాహన కల్పించాం. అదేవిధంగా మహారాష్ట్రకు కూడా పసుపు రైతులను పంపించడం జరిగింది. పసుపు అధికంగా పండే బాల్కొండ ప్రాంతంలో 42 ఎకరాలలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా భవిష్యత్తులో పరిశోధనలు చేసి అధికి దిగుబడినిచ్చే నూతన వంగడాలను కనుగొనడానికి కృషి చేస్తాం. విత్తనోత్పత్తి చేస్తున్న రైతులకు అధిక రుణాలను ఇవ్వడానికి వచ్చే వానాకాలం నుండి ప్రయత్నిస్తాం. ఈ దఫా జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తానని మంత్రి సభకు తెలిపారు.
Tags: Loans to seed production: Minister Comfort

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *