12న ఆధరణ లబ్ధిదారులకు రుణాలు పంపణీ

Date:10/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో నివాసం ఉన్న వివిధ కులాల వృత్తుల వారికి ఈనెల 12న మదనపల్లె జెడ్పి హైస్కూల్‌లో ఉదయం 10 గంటలకు రుణాలు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ శనివారం తెలిపారు. పట్టణంలోని వివిధ కులాలకు చెందిన 217 మంది లబ్ధిదారులను ఆధరణ పథకం క్రింద ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వీరందరికి సుమారు రూ.1.25 కోట్ల రుణాలు మదనపల్లెలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులందరు ఈ కార్యక్రమానికి హాజరై , రుణాల చెక్కులను తీసుకునేందుకు రావాలని కోరారు.

స్వైన్‌ప్లూ నివారణకు మందులు పంపిణీ

Tags: Loans to the beneficiary beneficiaries on 12th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *