రుణాలు వాయిదా వేయిస్తాం – రైతులందరిని ఆదుకుంటాం

Loans will be deferred - we will support all farmers

Loans will be deferred - we will support all farmers

– మంత్రి అమరనాథరెడ్డి

Date:14/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలోని రైతులు తీసుకున్న రుణాలను వాయిదా వేయించి, వేరుశెనగ పంటలో నష్టపోయిన రైతులందరికి నష్టపరిహారం అందించి, ప్రత్యామ్నయ పంటలు పండించే విధంగా విత్తనాలు 100 శాతం సబ్సిడితో అందజేసి ఆదుకుంటామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి తెలిపారు.

 

శుక్రవారం సాయంత్రం పుంగనూరు మండలం బండ్లపల్లె గ్రామంలో ఎండిపోయిన వేరుశెనగ పంటలను నియోజకవర్గ దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు, కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి, జిల్లా రైతు సంఘ నాయకుడు మనోహర్‌నాయుడుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఉలవల విత్తనాలు, పాతరగడ్డిని రైతులకు పంపిణీ చేశారు. మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేరుశెనగ పంటను జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో పండించేవారని, కానీ ఈ సారి లక్ష హెక్టార్లలో వేరుశెనగ పంటను వేశారన్నారు.

 

గతంలో పోల్చి చూస్తే ఎన్నడు లేని విధంగా వర్షాలు లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. రైతులందరికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించాలని వ్యవసాయశాఖ్యాధికారులను ఆదేశించారు. అలాగే ఉలవలు, ఉద్దులు, పెసరు, వెహోక్కజొన్న విత్తనాలను పంపిణీ చేసి, ప్రత్యామ్నయ పంటలను పండించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 

హంద్రీనీవా కాలువల్లో నీటిని త్వరలోనే పుంగనూరు మీదుగా విడుదల చేసి, కుప్పంకు తరలిస్తామన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత పెద్ద ప్రాజెక్టు అని దానిని నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని కొనియాడారు.

 

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి విజయకుమార్‌, పుంగనూరు స్పెషలాఫీసర్‌ , సెరికల్చర్‌ జెడి అరుణకుమారి, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, తహశీల్ధార్‌ మాదవరాజు, ఏవో జ్యోతమ్మ, ఏపివో శ్రీనివాసులు తో పాటు దేశం నాయకులు బత్తలాపురం రమణ, వెంకట్రమణారెడ్డి, లక్కుంట నాగరాజ, చంద్రారెడ్డి, రాంబాబు, ఎంపీటీసీ కేశవరెడ్డి, కుమ్మరవీధి ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Loans will be deferred - we will support all farmers
Loans will be deferred – we will support all farmers

రాష్ట్ర ప్రాజెక్టులు 95 శాతం పూర్తి

Tags: Loans will be deferred – we will support all farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *