Natyam ad

మద్యం వెనుక లాబీయింగ్

గుంటూరు  ముచ్చట్లు:


ఆంధ్ర ప్రదేశ్ లో మద్య నిషేధం సంగతేమో కానీ.. ఎక్కడా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు మాత్రం తెగ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో పది కొత్త మద్యం బ్రాండులు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. వీటినిక ఏపీ ఎబీసీఎల్ అనుమతులు ఇచ్చేసింది. వీటి ప్రత్యేకత ఏమిటంటే అదే కేటగిరిలో ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్రాండ్ల మద్యం కంటీ వీటి ధర ఎక్కువ. ప్రస్తుతం  ఏపీలో అందుబాటులో ఉన్న కొన్ని కేటగిరిల బీరు ధర రెండు వందల రూపాయలు అయితే.. ఇప్పుడు అ అదే కుటగిరిలో కొత్తగా అనుమతి వచ్చిన బ్రాండ్ బీరు ధర అంతకంటే ఎక్కువ. కొత్త బ్రాండ్ ధరను 220 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే క్వార్టర్ మద్యం ధర రూ.110లు కాగా కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ ల మద్యం క్వార్టర్ ధర 130 రూపాయలుగా నిర్ణయించారు.  తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు చెందిన కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

 

 

 

కాగా, కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. చెబుతోంది.దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు స్వయంగా జగనే ప్రకటించారు. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి రాష్ట్రంలోజరుగుతున్న దానికి పొంతనే లేకుండా పోయింది. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. సరికదా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా ఆదాయం విపరీతంగా పెరిగిందన్నది మాత్రం సత్యం. ఇక ప్రభుత్వమే చేస్తున్న మద్యం వ్యాపారంలో నాణ్యత లేని బ్రాండ్లను సరఫరా చేస్తూ, వాటిని కూడా గతంలో కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తోంది.

 

 

 

Post Midle

మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.  ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది.కానీ   జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారంటూ ధరలను పెంచేసుకుంటూ పోవడమే కాకుండా.. ఏకంగా వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకున్న ప్రభుత్వ నిర్వాకం చూస్తుంటే మద్య నిషేధం అన్న మాటను సర్కార్ అటకెక్కించేసిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Lobbying behind alcohol

Post Midle