Local body elections in AP soon.

త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.

-ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

Date:26/10/2020

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో వాయిదాపడ్డ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాన్ని కోరనున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి సర్క్యులర్ జారీ అయింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వంతో చర్చించనున్నారు.ఇటు ఎన్నికలకు సంబంధించి 13 జిల్లాలకు నిధులు కూడా విడుదలయ్యాయి.. మొత్తం రూ.8కోట్ల 25 లక్షల 3వేలు విడుల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వారంలో ఐదు రోజులే పని దినాలు..

Tags: Local body elections in AP soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *