పట్టణ ప్రగతిలో సత్ఫలితాలు సాధిస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు మంచి గుర్తింపు – కలెక్టర్ కృష్ణ భాస్కర్

Date;27/02/2020

పట్టణ ప్రగతిలో సత్ఫలితాలు సాధిస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు మంచి గుర్తింపు
– కలెక్టర్ కృష్ణ భాస్కర్

సిరిసిల్ల ముచ్చట్లు:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి సత్ఫలితాలు సాధిస్తే స్థానిక వార్డు కౌన్సిలర్ లకు, అధికారులకు ప్రజలలో మంచి

గుర్తింపు, పేరు లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం వార్డునెం.10, 11 లలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్ధ్యం చెత్త తొలగింపు పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీలోని ప్రైవేట్ ఖాళీ స్థలాలు చెత్త పేరుకొని ఉండడం పిచ్చి మొక్కలు పెరిగి

అస్తవ్యస్తంగా ఉండడాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మిక తనిఖీ లో గుర్తించారు. చెత్త పేరుకొని పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న పార్టీ ఖాళీ ఫ్లాట్ లను గుర్తించి సంబంధిత యజమానులకు

తమ ప్లాట్లను రెండు రోజుల్లో క్లీన్ చేయించాలని ఆదేశిస్తూ వెంటనే నోటీసులను జారీ చేయాలన్నారు. సంబంధిత యజమానులు ఫ్లాట్ లను నిర్దేశించిన సమయం లో క్లీన్ గా ఉంచుకునేలా

ఉంచుకునే విషయంలో విఫలమైతే మున్సిపల్ అధికారులు ఆ ఖాళీ ఫ్లాట్ లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పురపాలక కొత్త చట్టంలో పారిశుద్ధ్యం, పచ్చదనానికి అధిక ప్రాధాన్యం

ఉందని గుర్తుచేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పురపాలక వాహనాల్లో వేయాలని, రోడ్లపై, మురుగునీటి కాల్వల్లో వేస్తే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. పచ్చదనాన్ని

పెంపొందించేందుకు ప్రతి ఇంట్లో, కాలనీలలో రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటెలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హరితహారం లో భాగంగా గతంలో రోడ్లకు

ఇరువైపులా నాటిన మొక్కల లో అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయనీ అని అవి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పురపాలకం బడ్జెట్‌లో 10శాతం నిధులు హరితహారానికి వినియోగించాలని అని సూచించారు. కాలనీలలో రోడ్లకు ఇరువైపులా ఇష్టారీతిన మట్టి కుప్పలు ఉన్న విషయాన్ని గుర్తించిన

కలెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. వేములవాడ పట్టణంలో ఇప్పటికీ పందుల సంచారం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మందుల వల్ల పట్టణ ప్రజలు

ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పలుమార్లు తమ దృష్టికి తీసుకు వచ్చారని కలెక్టర్ గుర్తు చేశారు. పట్టణ ప్రగతి లో భాగంగా పందులను పట్టణ సరిహద్దు బయటకు తరలించేలా

కార్యాచరణ సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. వేములవాడ పట్టణంలో పందులు లేకుండా చూస్తే పాలకవర్గం కు ప్రజలలో మంచి పేరు వస్తుందని

కలెక్టర్ తెలిపారు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.
జిల్లా కేంద్రం సిరిసిల్లలో ఫిస్కల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డ్రై రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నామని…. వేములవాడ పట్టణంలో కూడా ఫిస్కల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డ్రై రిసోర్స్ సెంటర్ ను

ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని ఇప్పటికే పలుమార్లు ఆదేశించినా ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదన్నారు. పట్టణ ప్రగతిలో ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని

కలెక్టర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. వారం రోజుల్లో స్థల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు హామీ ఇచ్చారు.
వేములవాడ పట్టణంలో పట్టణ పరిధిలో భాగంగా గుర్తించిన ప్లాస్టిక్ చెత్తను సిరిసిల్ల పట్టణంలోని డ్రై రిసోర్స్ సెంటర్ కు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
పట్టణ ప్రగతిలో ప్రథమ కర్తవ్యంగా అన్ని కాలనీలలో చెత్తాచెదారం పిచ్చి మొక్కలు తొలగించి కాలనీలలో పరిశుభ్రత నెలకొనేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు ,అధికారులు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. తద్వారా వేములవాడ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణం గా

తీర్చిది ద్దాలన్నారు. ఆకస్మిక పర్యటనలో కలెక్టర్ వెంట వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్. మాధవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ,స్థానిక వార్డు కౌన్సిలర్ లు

,అధికారులు, మున్సిపల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు

 

Tags;Local Democrats have a good reputation for achieving urban growth
– Collector Krishna Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *