18న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్? (రివైజ్డ్)

Local Elections Notification on 18th? (Revised)
Date:15/04/2019
 హైదరాబాద్ ముచ్చట్లు :
 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానున్నది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీలోపు నోటిఫికేషన్ విడులా చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వై నాగిరెడ్డి తెలియచేసారు. సోమవారం ఉదయం కమీషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.ఈ సామావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి,పోలీసు డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రాష్ట్రంలో 535 జెడ్ పీ టీసీ,5385 ఎంపీటీసీ లకు ఎన్నికలు నిర్వహించాలి.ఎన్నికలు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఎంఎంపిక చేశామని వారికి శిక్షణా తరగతులు కూడా నిర్వహించామని ఎన్నికల కమిషన్ కమిషనర్ నాగిరెడ్డి తెలియ చేశారు. శాంతి భద్రత ల నిర్వహణకు అవసరమైన పోలీసులను నియమిస్తామని,ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తామని ఆయన విమరించారు.ఈనెల 18వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు,పోలీసు సూపరెండేట్లు,ఇతర అధికారులు తో సమావేశం నిర్వహిస్తామని,సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన పొలిసు భద్రతను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పేరు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిన జరుగుతుందని నామినేషన్ల ముగిసిన తరువాత ఇండిపెండెంట్లు గా పోటీచేసిన వారికీ గుర్తులు కేటాయించి బ్యాలెట్ పత్రాల ముద్రణను చేపడతారు. ఈ ఎన్నికలు మూడు దశలలో జరుగుతాయి.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రకారం ఎన్నికల ఫలితాలను లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత విడుదల చేస్తారు.
Tags:Local Elections Notification on 18th? (Revised)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *