Natyam ad

 ఏపీలో లోకల్ ఫ్లయిట్స్

కర్నూలు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విమాన ప్రయాణం ఇక చాలా సులభతరం కాబోతుంది. లోకల్ బస్సుల మాదిరిగా ఇకపై లోకల్ విమానాలు సందడి చేయనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, గన్నవరం, రేణిగుంట, కడప, రాజమండ్రిలో విమానాశ్రయాలు ఉండగా.. తాజాగా, కర్నూలులో కూడా ఎయిర్‌పోర్ట్ రెడీ అయిపోయింది. దీంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రయాణికుల జర్నీ మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా విశాఖపట్నం విమానాశ్రయానికి డిమాండ్‌ పెరుగుతోంది. వచ్చే వేసవిలో సేవలను విస్తరించేందుకు వివిధ విమాన సంస్థల నుంచి 80 వరకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) పరిశీలనలో ఉన్నాయి.విశాఖ విమానాశ్రయం ప్రస్తుతం పూర్తిగా నేవీ ఆధీనంలోనే ఉండటంతో వారిచ్చిన ఖాళీ సమయాల్లోనే ఈ విమానాల్ని నడపాలి. ఇది వరకే ఈ ప్రతిపాదనలపై నేవీ ఉన్నతాధికారులతో చర్చలు నడిచాయి. ఖాళీ స్లాట్ల ఆధారంగా అనువైన సమయాలను డీజీసీఏకు విమానాశ్రయ డైరెక్టర్‌ రాజకిశోర్‌ నివేదించారు. దాదాపు ప్రతిపాదనలన్నీ విశాఖ నుంచి నడిపేందుకు యోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో దీనిపై డీజీసీఏ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకిశోర్‌ తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ విమానాలపై ఇంకా నిషేధం కొనసాగుతోంది.

 

 

ఎప్పటి నుంచి ఆ విమానాలు మొదలవుతాయనే అంశంపై స్పష్టత లేదు. దీంతో ఇప్పుడొచ్చిన వేసవి ప్రతిపాదనలన్నీ కేవలం దేశీయంగా నడిపేందుకే.ఇక, విశాఖపట్నం నుంచి నూతనంగా కర్నూలు (ఓర్వకల్లు), నాగ్‌పూర్‌కు రోజువారీ సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ప్రతిపాదించింది. ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా తక్కువ టికెట్‌ ధరలతో కర్నూలుకు నడిపే విమానాన్ని ఇది వరకే ఇండిగో ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. విశాఖపట్నం నుంచి కర్నూలుకు కేవలం 57 నిమిషాలు మాత్రమే జర్నీ. ఈ సమయాల్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే కేవలం గంటలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేయొచ్చు. అలాగే విశాఖ- రాజమండ్రి విమాన సర్వీసును మార్చి 28 నుంచి సంస్థ పునరుద్ధరించనుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో విమాన ప్రయాణం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది.

 

Post Midle

Tags: Local flights in AP

Post Midle