తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

తెలుగుముచ్చట్లు సంక్రాంతి శుభాకాంక్షలు

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుముచ్చట్లు పాఠకులకు, ప్రకటన దారులకు , శ్రేయోబిలాషులకు బోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు . సంక్రాంతి సందర్భంగా ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న

 

                                                     …తెలుగుముచ్చట్లు యాజమాన్యం.

 

సంక్రాంతికి ముస్తాబవుతున్న పల్లె సీమలు

Tags: Sankranthi Greetings

కందిపప్పు, నూనె పంపిణీ

Date:01/11/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో గురువారం గ్రామదర్శిని – గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన కందిపప్పు, నూనె తదితర వంట సామగ్రిని మండలo లోని అన్ని ప్రాథమిక పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎంపీడీఓ శ్రీనివాసులు, మండల విద్యాశాఖాధికారి హేమలత పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎంఈవో హేమలత మాట్లాడుతూ నవంబరు నెల 1వ తేది నుంచి ప్రతి పాఠశాలకు కందిపప్పు, వంటనూనె ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ప్రతి విద్యార్థి కి 20గ్రాముల పప్పు, ఉన్నత స్థాయి విద్యార్థులకు 30గ్రాముల పప్పు ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే వంట నూనెను 1 నుంచి 10 వతరగతి వరకు గల ప్రతి విద్యార్థికి 5గ్రాములు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు వారానికి 5 కోడిగుడ్లను మధ్యాహ్న భోజన నిర్వహకులే పెట్టాలని తెలిపారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

Tags:Distribution of iris, oil

గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమరనాథ రెడ్డి 

Date:31/10/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మండలం కొలమాసనపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాలలో బుధవారం జరిగిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి.

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేయడమే ఈ ప్రభుత్వం ముఖ్య ఉదేశ్యం.
గ్రామాదర్శిని కార్యక్రమంలో ప్రభుత్వం ఆములుచెసే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, పార్టీలకు అతీతంగా అర్హులకు పెంచన్లు, రేషన్ కార్డులు అందజేయడం.
అన్ని గ్రామాలకు యల్ ఇ డి బలుపులు వేయడం, అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు వేయడం.
అన్ని గ్రామాలకు సిసిరోడ్లు వేయడం. కొన్ని గ్రామాలలో త్రాగునీటి సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారిస్తాము. రాష్ట్రంలో 3 లక్షల రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని.
– మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి.

పార్టీలకు,కులాలకు అతీతంగా నిజమైన అర్హత కలిగిన లబ్బిదారులకు పింఛన్లు,రేషన్ కార్డులు అందించడమే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యన్.అమరనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం,పలమనేరు మండలం,కొలమాసనపల్లి పంచాయతీలో గోల్లపల్లి,కొర్రూమాకులపల్లి,అయ్యాంరెడ్డిపల్లి, గుండ్లపల్లి, ఎగువ కల్లాడు, దిగువ కల్లాడు, నదిమి కల్లాడు, మాదిగ కల్లాడు, చెన్ను పల్లి,దిగువ మారుమారు,పాలమాకులపల్లి,మాదిగ బండ,ఎర్రగుండెపల్లి,కొలమాసనపల్లి, సాకేవురు,బేలుపల్లి క్రాస్,కుర్మాయి.

ఎగువ మారుమూరు, దుగ్గినవారిపల్లి, గంగారపురం, గ్రామంలో మంత్రి పర్యటించారు. మంత్రి గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామాల లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు.  ప్రజల నుంచి సమస్యలు అర్జీలను స్వకరించారు. కొన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన సిసిరోడ్లు ను ప్రారంభోత్సవం,అంగన్ వాడి కేంద్రాలను పరిశీలించి, పిల్లలతో మంత్రి పలకరించి, భోజనం బాగుందా, కోడి గుడ్డు పెట్టుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు.అయ్యాం రెడ్డిపల్లి గ్రామం నందు రూ.3 లక్షల జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన సిసిరోడ్లు ను, శ్రీరంగ రాజ పురం గ్రామం నందు రూ .4 లక్షల ఉపాధి హామీ పథకం మరియు 14 వ ఆర్థిక నిధులతో ఏర్పాటు చేసిన సిసిరోడ్లు ను, గుండ్ల పల్లి గ్రామం నందు రూ.3 లక్షల ఉపాధి హామీ పథకం మరియు 14 వ ఆర్థిక నిధులతో ఏర్పాటు చేసిన సిసిరోడ్లు ను మంత్రి ప్రారంబొత్సవం చేశారు.
కొలమాసనపల్లి పంచాయతీ, కురవపల్లి చెరువు దగ్గర రూ.6 లక్షలతో నిర్మించిన చెత్త నుండి సంపదను తయారు చేసే కేంద్రంను ప్రారంభించారు. యస్.ఆర్ పురం, దిగువ కల్లాడు, మరియు దిగువ మారుమూరు గ్రామాల నందు అంగన్ వాడి కేంద్రాలని పరిశీలించారు.

మధ్యాహ్నం కొలమాసనపల్లి నందు మంత్రి పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ ఈరోజు కొలమాసనపల్లి పంచాయతీ లోని గ్రామాలలో గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రల్గొనదంజరిగిందని తెలిపారు. గ్రామదర్శిని కార్యక్రమమ వల్ల ప్రభుత్వం ఆములు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా,లేదా ఇంకా అర్హులు ఉన్నారా ఉంటే ఎందుకు పెంచన్లు,రేషన్ కార్డులు అందలేదు నే వివరాలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గ్రామాలకు లింక్ రోడ్లు వేయడం,అన్ని గ్రామాలలో సిసిరోడ్లు, యల్.ఇ. డి బలుపులు వేయడం జరిగిందని తెలిపారు.అన్ని గ్రామాలలో అంగన్ వాడి భవనాలు నిర్మాణాలు చేస్తున్నామని అన్నారు.నిరు పేదలకు కొరకు చంద్రన్న బీమా,చంద్రన్న పెండ్లి కానుక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పంచాయతీ లో సుమారుగా 120 గృహాల మంజూరు చేసి నిర్మించడమ జరిగిందని, తెలిపారు. ఇంకా నియోజకవర్గానికి 2 వేలు గృహాల మంజూరు ఆయాని గృహాలు లేని వారిని గుర్తించి నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పసుపు కుంకం ద్వారా మహిళా సంఘాలు రూ 2 వేలు వారికి అందజేయవలసియున్నది దాని కూడా దసరా పండగ సందర్భంగా వారి బ్యాంక్ ఖాతా లకు జమచేయడం జరిగిందని అన్నారు. రైతులకు రుణమాఫీ మూడు దశలో రైతుల బ్యాంక్ ఖాతలకు జమచేయడం జరిగిందని, కొన్ని టెక్నిల.సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కాకారం చేయడం జరుగుతుందని తెలిపారు

రాష్ట్ర విభజన జరిగి రూ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ వున్నాను రాష్టాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారంటే అనుభవం కలిగిన ఒక సంవర్ధమైన నాయకుడు గనుక ఇన్ని కార్యక్రమాలను ఆములుచేస్తున్నారని, ఈ నాయకుని ఇంకా పది కాలంపాటు ఉంటే మన బిడ్డల భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు అందరికి ప్రభుత్వం పథకాలను అందజేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామాలలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ జరగని అభివృధ్ధి ఈ నాలుగేళ్ళలో జరగడం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. అన్ని గ్రామాలకు సిసి రోడ్లు,గ్రామాలకు గ్రామాలకు రోడ్లు అనుసందానం,యల్ ఇ డి బల్బులు,త్రాగునీరు సరఫరా, ఇంటింటి నుండి చెత్త సేకరణ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు. గతంలో అయితే పెంచన్లు సక్రమంగా అర్హులకు చేరేదిలేదని,ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీ న నేరుగా లబ్దిదారులకు ఇండ్లు కు వెళ్లి వారి వేళ్ళు గుర్తులవేసిన తరువాతనే పారదర్శకంగా పెంచన్లు,రేషన్ సరుకులను నిజమైన లబ్దిదారులకు అందజేయడం జరువుతుందని తెలిపారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేయడం, రూ.50 వేలు ఉన్న రైతులకు ఒకే సారి రుణమాఫీ అయిందని, ఇప్పటికి 3 దశలలో రైతుల బ్యాంకుల ఖాతాలకు జమచేయడం జరిగిందని, మిగిలినది కూడా అందజేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు, డ్రిప్ పరికరాలు,ట్రాక్టర్లతో పాటు విత్తనాలు, అర్హులైన వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంజరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు .ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయమ కొరకు రాయితీ పై వ్యవసాయ యంత్రలను,రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్లను అందజేయడం తోపాటుగా డ్రిప్ పరికరాలను యస్ సి,యస్ టి ల రైతులకు వంద శాతం ఉచితంగాను 5 ఎకరాల లోపు మిగిలిన రైతులకు 90 శాతం రాయితీ తో డ్రిప్ పరికరాల ను అందిస్తున్నాముని తెలిపారు. ఇటీవల కావలసిన రైతులకు ఉచితంగా ఉలవలను పంపిణీ చేశామని,
గ్రామీణ ప్రాంతాల్లో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగి కుటుంబంలో వ్యక్తి చనిపోతే వారికోసం చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారి గృహాల లో వివాహం చేసుకొనుటకు చాలా ఇబ్బందులు వుంటాయని వారికోసం చంద్రన్న పెండ్లి కానుక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ గాంధీ జయంతి నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా డిగ్రీ వరకు చదువు కొని నిరువుద్యోగిలు గా ఉన్న 22 సం .35 సం లో పు యువతకు నెలకు రూ.వెయ్యి రూపాయల తో పాటుగా వారి ఉపాధి కల్పించుటకు వృత్తి నైపుణ్యం కలిగించి పరిశ్రమల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కలిగించడం జరుగుతుందని తెలిపారు. ఎవ్వరు లేని వంటరి మహిళలకు పెంచన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన పేదలకు అందరికి ఇళ్ళు,పెంచన్లు, రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇంకా పది కాలాలపాటు ఉంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొనుటకు అవకాశాలు వుంటాయని తెలిపారు.

మహిళలు గర్భం దాల్చిన నుంచి అన్ని రకాల టీకాలు వేయించి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించి తల్లిబిడ్డ ఎస్ప్రెస్స్ ద్వారా వారిని ఇంటి దగ్గర దింపి బిడ్డకు యన్.టి.ఆర్, బసవతారక క్వాటీలను అందచేయడం జరుగుతుందని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు.9 వతరగతి చదివే బాలికలు మధ్యలో చదువు ఆపకుండా చదువు కొనుటకు సైకిలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాల.మైనార్టీల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మసీదులో ప్రార్థనలు చేసే ఇమామలు మౌజులకు జీతం ఇస్తుందని, విదేశీలకు వెళ్లి చదువు కొనే పేద విద్యార్థులకు యన్ టి ఆర్ విద్యా పథకం ద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోవడం కోసం రూ.10 లక్షలు అందజేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యం పి డి ఓ,హుర్మత్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, యం.పి.పి,గీత, జడ్పీటీసీ సబ్యులు శమంతకమణి, యం.పి.టి.సి లు, మంజుల రెడ్డి,మునిరత్నం, పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, బాలాజీ, జగదీ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

ఇక ప్రతి శనివారం బాబు హస్తిన టూర్

Tags:Amaranth Reddy, who is visiting the village and village development program

పాఠశాలను తనిఖీ చేసిన మదనపల్లి డీవై ఈవో ముస్తక్ అహమ్మద్

Date:30/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండలం లోని నిడిగుంట గ్రామంలోని ప్రభుత్వ జెడ్పి ఉన్నత పాఠశాలను మదనపల్లె డిప్యూటీ ఈవో ముస్తక్ అహమ్మద్ మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని పదవతరగతి విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. పదవతరగతి విద్యార్థులు పబ్లిక్ పరిక్షల్లో వందశాతం ఉతీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శాఖాపరమైన ఇబ్బందులుంటే తమ దృష్టికితీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి హేమలత, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

బీజేపీలోకి సినీనటి రేష్మారాథోడ్‌

Tags:Madanapalli Diwi Ewa Mudak Ahmad who checked the school

పథకాలను ప్రజలకు తెలియజేయాలి – పార్టీ పటిష్టతకు పాటు పడాలి

– మంత్రి అమరనాథ రెడ్డి

Date:29/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళి వివరించాల్సిన భాధ్యత పార్టీ నాయకులు,కార్యకర్తలదేనని పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి సూచించారు. పెద్దపంజాణి మండలంలోని మంత్రి స్వగ్రామమైన కెళవాతి గ్రామంలో సోమవారం రాయలపేట పంచాయతీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెదేపా ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. నిష్పక్షపాతంగా,పార్టీలకతీతంగా అందిస్తోన్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా చూడాలన్నారు.

గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిపి మురళీక్రిష్ణ, మండల పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, కార్యదర్సి మురహరి రెడ్డి,నాయకులు రోజా రెడ్డి,రామక్రిష్ణ, సుధాకర్ రెడ్డి,భాను,నాగరాజు,ప్రకాషం శెట్టి,బుద్దు,రవి,చంద్ర తదితరులున్నారు.

రాహుల్ గోత్రమేంటీ 

Tags:The schemes should be informed to the people – the party’s strength should fall

టీడీపీ కార్యకర్త మృతికి సంతాపాన్ని తెలియజేసిన మంత్రి

Date:29/10/2018

పలమనేరు ముచ్చట్లు:

గంగవరం మండలం కీలపల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాఘవేంద్ర (37) మృతిపట్ల మంత్రి అమరనాథ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాత ఇంటిని కూలదోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గోడకూలి మీదపడడంతో మృతి చెందిన రాఘవేంద్ర.  భౌతికకాయాన్ని పోస్టుమార్టమ్ అనంతరం పలమనేరు ప్రభుత్వాస్పత్రి వద్ద స్థానిక నాయకులతో కలసి సందర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఆర్థికసాయాన్ని మృతుని కుటుంబీకులకు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మృతుని కుటుంబీకులకు సానుభూతిని తెలిపారు. మంత్రి వెంట పలమనేరు ఏరియా ఆస్పత్రి కమిటీ చైర్మన్ బాలాజీ నాయుడు,గంగవరం మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ నాయుడు తదితరులున్నారు.

బషీరాబాద్ లో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన

Tags:Minister of relief for the death of TDP activist

మునిసిపల్ మీటింగ్ హాల్ ను ప్రారంభించిన మంత్రి అమర్

Date:29/10/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మీటింగ్ హాల్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ శారదమ్మ, వైస్ చైర్మన్ చాంద్ భాషా, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

టవరెక్కిన డీఎస్సీ అభ్యర్ధులు

Tags:Amar, who started the municipal meeting hall