Natyam ad

ఉద్యోగుల కేటాయింపుల్లో స్థానికతను ప్రమాణికంగా తీసుకోవాలి

కరీంనగర్ ముచ్చట్లు:
 
మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ 317 జీవో గందరగోళం. ఉద్యోగుల కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి. బదిలీల సమయంలో ప్రతి జిల్లాలో ఉన్న ఖాళీలును చూపించాలని అన్నారు.
ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలి.  ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన తర్వాతనే నూతన గైడ్ లైన్స్  బదిలీలు చేపట్టాలి.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. తెరాస ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులతో చర్చ జరుపలేదు. ఎమ్మెల్సీ లుగా ఎందుకు ఉన్నట్లు. ముఖ్యమంత్రి గారికి నా మనవి ఉపాధ్యాయలు ఇబ్బందులకు గురిచేయొద్దు.  అవసరమైతే జూనియర్ ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతున్నా. తొమ్మిది మంది  ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. కోటి రూపాయల ఎక్సగ్రేషియా ఇవ్వాలి లేకుంటే కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వాలని అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Locality should be taken as a criterion in employee assignments