వేములవాడలో స్థానికులే… కానీ స్థానికేతరులు

కరీంనగర్, ముచ్చట్లు:

వేములవాడలో రాజకీయ రసవత్తరంగా మారింది. పౌరసత్వ వివాదాల నేపథ్యంలో చెన్నమనేనికి టిక్కెట్‌ దక్కకపోవడం, మరోవైపు ఒకే సామాజిక వర్గానికి చెందిన బంధువులు వేర్వేరు పార్టీల నుంచి తలపడుతుండటంతో వేములవాడ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వేములవాడలో మెడికల్ కాలేజీ యజమానుల పొలిటికల్ ఎంట్రతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన దగ్గరి బంధువులు రానున్న ఎన్నికల్లో తలపడుతున్నారు.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది, అయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీలు పూర్తి చేస్తున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అభ్యర్థుల్లో వేములవాడ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును మార్చి ఆయన స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహరావును ఎంపిక చేసారు.రమేష్ బాబు జర్మనీలో ఉండగానే అభ్యర్థులను ప్రకటించగా,ఆయన ఇండియాకు తిరిగిరాగానే మరో పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. జర్మనీ నుండి రాగానే ముఖ్యమంత్రిని కలిసిన రమేష్ బాబుకు పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని హమీ ఇస్తు వ్యవసాయరంగ సలహాదారుగా నియమించడంతో బిఆర్‌ఎస్‌లో సమస్య సద్దుమణిగింది.నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో చెన్నమనేని కుటుంబానికి కంచుకోటగా ఉన్న వేములవాడ నియోజకవర్గంలో, రమేష్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆయన రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటారని అంతా భావించారు.

Post Midle

చెన్నమనేని కుటుంబం మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు బీజేపీ కండువా కప్పుకున్నారు.ప్రతిమా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజలకు చేరువైన వికాస్ రావు చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు. నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో ప్రజలకు రాజకీయ సేవలందిస్తున్న చెన్నమనేని కుటుంబ సభ్యుడిగా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు.తండ్రి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న వికాస్ అనూహ్యంగా బీజేపీలోకి రావడంతో సమీకరణలు మారిపోయాయి.

బీజేపీ తరపున ఎమ్మెల్యే బరిలో నిలవడానికి పోటీపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టీఆర్ఎస్ పార్టీని వీడి ఈటెల రాజేందర్ తో పాటు కాషాయదళంలో అడుగు పెట్టిన మాజీ జడ్పీ చైర్మైన్ తుల ఉమల పరిస్థితి వికాస్‌రావు రాకతో అయోమయంగా మారింది.వికాస్ రాకతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న నేతలందరి పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో చల్మెడ మెడికల్ కాలేజీ ఉంది.దశాబ్ద కాలంగా వేములవాడ నియోజకవర్గంతో పాటు జిల్లాలో తమ కాలేజీ తరపున వైద్య సేవలందిస్తున్నారు. భారతీయజనతా పార్టీ నుండి వేములవాడ టికెట్ ఆశిస్తున్న వికాస్ రావు తండ్రి విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా మెడికల్ కాలేజీలో భాగస్వామిగా ఉన్నారు.

వికాస్ కూడా డాక్టర్ గా తన వైద్య సేవలను ప్రతిమా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. ఇద్దరు అభ్యర్థులు ఒకే నేపధ్యంలో ఒకే సామాజిక వర్గం నుండి వచ్చిన వారు కావడంతో స్థానిక రాజకీయం రంజుగా మారింది.బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు,బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు ఇద్దరి పూర్వికులు వేములవాడ నియోజకవర్గానికి చెందిన వారే అయినా వారిద్దరు ప్రజలకు అందుబాటులో ఉండరని స్థానిక అభ్యర్థిగా రెండు సార్లు గెలుపుకు ఆమడ దూరంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిశ్రీనివాస్ తన ప్రచారాన్ని ప్రారంభించారుతాను మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని ,స్థానికేతరులకు అవకాశం ఇచ్చి నియోజకవర్గ అభివృద్ది నిరోధకులుగా మారవద్దని ప్రచారం ప్రారంభించారు.

 

Tags: Locals in Vemulawada… but non-locals

Post Midle