పుంగనూరులో తాళాలు పగులగొట్టి దొంగతనం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని షిరిడిసాయినగర్‌లో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి రెండు వెండిదీపాలను, ఒక టీవిని దొంగలించుకెళ్లిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇంటి యజమాని వాసు తాళాలు వేసుకుని ఊరికి వెళ్లాడు. అలాగే ఇంటిపైన అద్దెకు ఉన్న వారు కూడ ఊరికివెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు వాసు ఇంటి తాళాలు పగులగొట్టి టివి, రెండు వెండి దీపాలను దొంగలించుకెళ్లారు. అద్దె కుటుంబం ఉన్న ఇంటిలో ఏమి చోరి జరగలేదు. కుటుంబ సభ్యులు సోమవారం ఈ విషయాన్ని కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌టీమ్‌ను పిలిపించి వేలిముంద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Lock-breaking and theft in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *