25 crore people in lockdown again in China

మళ్లీ లాక్ డౌన్!

#నాలుగోసారి పొడగింపు
#వెసులుబాటు పై రాత్రికి కేంద్రం ప్రకటన

Date:17/05/2020

అమరావతి ముచ్చట్లు:

మార్చి 22న జనతా కర్ఫ్యూ తో మొదలైన కరోనా వైరస్ కట్టడి లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ మేరకు కేంద్రం ప్రకటన వెలువడింది. నాలుగో విడత లాక్ డౌన్ అమలు విషయంలో కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో దేశ ప్రజలు ఈ నెల 31దాకా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అన్ని రంగాలు తీవ్రమైన ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయి. ఉద్యోగుల వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో వారిని ఇళ్లకు సాగనంపుతారు. కేంద్రం ప్యాకేజీలు ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు కావాల్సి ఉంది. తొలివిడత ప్యాకేజీ తర్వాత ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ. ఏలా ఆదుకుంటాయో క్షేత్రస్థాయిలో వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయపరంగా తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్రలను ఆదుకునే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు ప్రకటించలేదు. ఇప్పటికే 57 రోజుల లాక్ డౌన్ పూర్తయింది. దీనివల్ల దిగువ మధ్య తరగతి, కార్మికులు, దినసరి కూలీలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం వారిని ఆదుకునే విధంగా లేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 31 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నందున ఈ వర్గాల పై దృష్టి సారించాల్సి ఉంది. కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి.

వలస కార్మికులకు విజయవాడ నగర పోలీసుల మానవీయ సహాయం :

Tags: Lockdown again!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *