పుంగనూరు లో ఆగస్టు 15 వరకు లాక్ డౌన్ పొడిగింపు

-ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్

-కమిషనర్ కె.ఎల్ వర్మ వెల్లడి

Date:02/08/2020

 

Lockdown extension till August 15 in Punganur

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో కరోనా మహమ్మారి వ్యాధి రోజురోజుకూ పెరుగుతుండటంతో కరోనా ను నియంత్రించేందుకు ఈ నెల 15 వరకు పట్టణాన్ని లాక్డౌన్ చేస్తూ ప్రతి ఆదివారం సంపూర్ణ చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆదివారం తాసిల్దార్ వెంకటరాయలు, సీఐ గంగిరెడ్డి ,కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి సమావేశంలో తీర్మానించినట్లు కమిషనర్ తెలిపారు .పట్టణంలో ఇప్పటివరకు 120 మందికి కరోనా సోకిందని, ఏడు మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. వ్యాధి బారినపడిన వారిలో ఎక్కువ మంది వ్యాపారులు ఉండటం గమనార్హం అని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఈ నెల 15 వరకు లాక్ డౌన్ చేస్తున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వ్యాపారాల కు అనుమతి ఇస్తున్నామన్నారు .10 గంటల పైన ఎవరు బయట తిరగరాదు అని హెచ్చరించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు .కరోనా నియంత్రణ కోసం పట్టణంలో వివిధ సేవా సంఘాలు వారు ముందుకు వచ్చి వారి వారి ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు .ముఖ్యంగా యువకులు కావాలని ద్విచక్ర వాహనాల్లో sanchar ఇస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రజలు సహకరిస్తే సహకరిస్తూ కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు .ముఖ్యంగా వ్యాపారులు మాస్కులు, శానిటైజర్ లు లేకపోతే దుకాణాల్లో కి రాణి వద్దని నిబంధనలకు కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్దర్ తదితరులు పాల్గొన్నారు.

APCOSలో విలీన నిర్ణయాన్ని ఉప‌సంహ‌రించుకోకుంటే ఆగస్టు 17 నుండి నిరవధిక నిరసనలు 

Tags: Lockdown extension till August 15 in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *