ఆగస్టు 14వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు

Date:05/08/2020

తిరుపతి ముచ్చట్లు:

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని దుకాణాలు అనుమతి.తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన కమిషనర్ గిరీష.తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో (కోవిడ్-19) కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ గత నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వున్న లాక్ డౌన్ ను ఆగస్టు 14 వరకు పొడిగించడం జరిగింది, నగరంలో (కోవిడ్ -19) కరోనా వైరస్ మరియు అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు రేపటి నుండి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి.

 

తిరుపతి నగరంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే దానికి నగరపాలక సంస్థ పరిధిలోని లాక్ డౌన్ పొడిగించే ఆగస్టు 14వ తేదీ వరకు ఆంక్షలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నగరంలో లో అన్ని వ్యాపార లావాదేవీలకు అనుమతులు ఉంటాయి అన్నారు, నగరంలో ప్రతి ఒక్కరు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అత్యవసరమైతే తప్ప బయట ఎవరు తిరగకూడదని తెలియజేశారు మరియు ఈ చర్య ప్రజాఆరోగ్యమును దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు మధ్యాహ్నం 2 గంటల పైనే తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయబడును.

 

వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలి.

నగరంలో తొమ్మిది ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో కోవిడ్ పరీక్షలు నిర్వహించే ప్రదేశాలు
1. అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ వద్ద.
2. అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, చాపల మార్కెట్ ఎదురుగా.
3. అర్బన్ హెల్త్ సెంటర్ సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, నెహ్రూ నగర్.
4. అర్బన్ హెల్త్ సెంటర్ పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు.
5. అర్బన్ హెల్త్ సెంటర్ ఆటోనగర్, రేణిగుంట రోడ్డు.
6. అర్బన్ హెల్త్ సెంటర్ శివ జ్యోతి నగర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవకోన.
7. హార్ట్ హెల్త్ సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్డు.
8. మున్సిపల్ హెల్త్ సెంటర్, ప్రకాశం రోడ్డు.
9. అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీలామహల్ రోడ్డు, తిరుపతి.
నగర ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే నే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని, కోవిడ్ లక్షణాలు లేకపోతే రాకూడదని తెలియజేశారు.తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల పైన దుకాణాలు తెరిచిన చోనగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయవలెను.

శ్రీ రామ జన్మభూమి లో మందిర నిర్మాణానికి శంకు స్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Tags: Lockdown extension until August 14th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *