Lockdown rules should be strictly followed - Commissioner KL Verma

లాక్‌డౌన్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:05/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటిలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, సీఐ గంగిరెడ్డితో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన వ్యాపారులకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతి లభించిందన్నారు. మిగిలిన వ్యాపారాలకు అనుమతి లేదన్నారు. కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తి గత పారిశుద్ధ్యం పాటిస్తూ భౌతికదూరం నిర్వహించాలని సూచించారు.

సుప్రీం కోర్టు ఆధారాల పరిశీలన

Tags: Lockdown rules should be strictly followed – Commissioner KL Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *