ఘనంగా లోద్ది మల్లయ్య ఉత్సవాలు

Lodhi Mallaiya celebrations

Lodhi Mallaiya celebrations

Date:23/07/2018
అచ్చంపేట ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లోని నల్లమల్ల ఫారెస్ట్ లో గలా లోద్ది మల్లయ్య ఉత్సవాలు ఘనంగా తొలి ఏకాదశినాడు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై పరహాబాద్ చౌరస్తా నుండి నడక మార్గంలో 10 కి లో మీటర్లు నడచి వెళ్ళాలి. సుమారు 200 అడుగుల లోపలికి దిగి లింగమాయ్య స్వామిని దర్శించుకోవాలి. అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు రాళ్లు రప్పలు,  వాగులు, వంకలు,  పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం వుంటుంది. లోద్ది చేరుకున్న తరువాత లోయలోకి దిగి స్వామిని దర్శించుకోవాలి.  హైదరాబాద్,  కర్ణాటక, మహబూబ్ నగర్, గద్వాల్,  నాగర్ కర్నూల్ జిల్లాల నుండి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. నల్లమల్లలో  ప్రసిద్ధిగాంచినఈ  దేవాలయానికి జాతర రోజుల్లో వేలాది మంది భక్తులు వస్తారు. భక్తులంతా  లోద్ది మల్లయ్య ను దర్శించు కొని రాత్రి జాగారం చేసి పూజలు చేసి తిరుగు ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ చెంచులు పూజారులు గా వుండడం విశేషం. మల్లయ్య దర్శనంతోపాటు  అడవి అందాలను తిలకించాడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. మన తెలంగాణ రాష్ట్రం లో మరో అమర్ నాథ్ యాత్రను తలపిస్తుంది.
ఘనంగా లోద్ది మల్లయ్య ఉత్సవాలు https://www.telugumuchatlu.com/lodhi-mallaiya-celebrations/
Tags:Lodhi Mallaiya celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *