లోక్‌అదాలత్‌లు పరిష్కార వేదికలు
పుంగనూరు ముచ్చట్లు:
లోక్‌అదాలత్‌లను పరిష్కార వేదికలుగా మార్చుకుని ప్రజలు తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు సూచించారు. గురువారం న్యాయసేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు ఆవరణంలో ప్రజలకు అవగాహన సదస్సును ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సిందుతో కలసి నిర్వహించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ కేసుల్లో ఉన్న వారందరికి కేసులు గురించి భయాందోళనలకు లోనుకావడం సహజమన్నారు. దీని ద్వారా ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు రాజీధోరణిలో కేసులు పరిష్కరించుకోవడం మంచిదన్నారు. దీని ద్వారా ఖర్చు మిగలడంతో పాటు సమయాన్ని ఇతర పనులకు కేటాయించుకోవచ్చునన్నారు. లోక్‌అదాలత్‌లో రాజీకి అనువైన కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. అలాగే డిసెంబర్ 9న జాతీయ మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు, వివిధశాఖల అధికారులు, ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లా శివశంకర్‌నాయుడు, న్యాయవాదులు వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు గుడ్‌టచ్,బ్యాడ్‌టచ్‌పై అవగాహన ఉండాలి…
విద్యార్థులు అన్ని విషయాల్లోను జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా గుడ్‌టచ్,బ్యాడ్‌టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక కస్తూరిభా పాఠశాలలో ఆమె అవగాహన సదస్సును నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ వరకట్నం నిషేదంతో పాటు బాల్యవివాహాలు, పోక్సోతో పాటు విద్యాహక్కుపై కూడ అవగాహన పెంచుకుని , తమంతకు తాము భద్రతను చూసుకోవాలన్నారు. బాలికలపై లైంగిక దాడులు జరిగితే తక్షణమే తల్లిదండ్రులకు తెలిపి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆనందకుమార్, వీరమోహన్‌రెడ్డి, మహమ్మద్‌నూరి, ప్రిన్సిపాల్ గాయిత్రి తదితరులు పాల్గొన్నారు.
Tags: Lok Adalats are redressal forums
