లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి

Date:20/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
 రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఎన్నికల ఏర్పాట్లపై తరుచూ సమీక్షలు, సమావేశాలు, క్షేత్ర స్థాయి పరిశీలనలను నిర్వహిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ మరోవైపు ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై అవగాహన పెంచేందుకు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెడుతూ, ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల పరిష్కారం కోసం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. సీ-విజిల్ యాప్‌తో ఫిర్యాదులు, ఈవీఎం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై అవగాహన నిమిత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని . ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు వీలుగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని సూచించారు. ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సవరణలో హైదరాబాద్ జిల్లాలో లక్షా 50వేల మంది యువతీయువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారని వివరించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు యువత టెక్నాలజీని వినియోగించటంలో ముందంజలో ఉందని, ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో సీ-విజిల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఎన్నికల సందర్భంగ ఎక్కడ ఎలాంటి అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ఆ యాప్‌తో వెంటనే ఫిర్యాదు చేసి, అక్రమాలను అడ్డుకోవటంలో తమకు సహకరించాలని సూచించారు.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని కమలానెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు గాను కమలానెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీ భవనంలో డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఈ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ, వాటిని తిరిగి స్వీకరించటం, స్ట్రాంగ్ రూంల ఏర్పాటు, భద్రత తదితర అంశాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఇతర సౌకర్యాలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా డీఆర్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సికిందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాని సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో, సనత్‌నగర్ అసెంబ్లీకి సంబంధించిన డీఆర్‌సీ కేంద్రాన్ని ఓయూ ఏంబీఏ కాలేజీలో, అంబర్‌పేట అసెంబ్లీ కేంద్రాన్ని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో, ముషీరాబాద్, నాంపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్రాలను ఎల్‌బీ స్టేడియంలో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్రాలను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు.మలక్‌పేట నియోజకవర్గానికి సంబంధించిన కేంద్రాన్ని అంబర్‌పేట మున్సిపల్ స్టేడియంలో, గోషామహల్ అసెంబ్లీకి చెందిన కేంద్రాన్ని కోఠి ఉమెన్స్ కాలేజీలో, బహదూర్‌పురా అసెంబ్లీ డీఆర్‌సీ కేంద్రాన్ని మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో, కార్వాన్ అసెంబ్లీ కేంద్రాన్ని మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం డీఆర్‌సీ కేంద్రాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పాలిటెక్నిక్ కాలేజీలో, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన డీఆర్‌సీ కేంద్రాన్ని నిజాం కాలేజీ లైబ్రరీ హాల్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Tags:Lok Sabha election arrangements have risen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *