లోకేష్, జీవిఎల్ ట్వీట్ వార్

Lokesh, JVL Tweet War

Lokesh, JVL Tweet War

Date:05/07/2018
విజయవాడ ముచ్చట్లు:
మంత్రి నారా లోకేష్.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మధ్య ట్వీట్‌వార్ నడుస్తోంది. లోకేష్ ఓ కేంద్రమంత్రి దగ్గర లాబీయింగ్ కోసం ఒకరిని పంపారని జీవీఎల్ ఆరోపణ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆయనెవరో చెప్పాలని డిమాండ్ చేస్తూ మళ్లీ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించి నరసింహారావు. తాను చేసిన ఆరోపణలపై స్పందించేందుకు 36 గంటల సమయం పట్టిందా అంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పేర్లు వెల్లడిస్తానని చెప్పారు. జీవీఎల్ కామెంట్స్‌కు లోకేష్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్‌లో.. జీవీఎల్ గారు గుడ్ మార్నింగ్.. ‌కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం.. అందుకే శాఖాపరమైన పనుల్లో బిజీగా ఉన్నా.. అందుకే మీరు చేసిన అసత్య ఆరోపణలపై స్పందించడానికి 36 గంటలు పట్టింది. పేర్లు బయటపెట్టడానికి జీవీఎల్‌కు ఇంత సమయం పట్టడం ఆశ్చర్యంగా ఉందని సెటైర్ వేశారు. మీలో సృజనాత్మకత తగ్గిపోయిందా? అని ప్రశ్నించారు మంత్రి.
లోకేష్, జీవిఎల్ ట్వీట్ వార్ https://www.telugumuchatlu.com/lokesh-jvl-tweet-war/
Tags:Lokesh, JVL Tweet War

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *