2024 జనవరి నుంచి లోకేష్ పాదయాత్ర

విజయవాడ ముచ్చట్లు:


యాత్ర‌లంటే బామ్మ‌గారి తిరుప‌తి యాత్ర‌, కాశీయాత్రో అనుకునేవారు. కాల‌క్ర‌మంలో భ‌క్తిపూర్వ‌కంగానే కాదు, సామాజిక న్యాయం కోస‌మో, రాజ‌కీయ‌ల‌బ్ధికో ఒక యాత్రకు వెళ్ల‌డం చూస్తున్నాం. ఇపుడు  రాను రాను యాత్ర అంటే పాద‌యాత్ర‌లకే అధిక ప్రాధాన్యం ఏర్ప‌డింది. రాజ‌కీయ‌పార్టీల‌వారు అన్ని ప్రాంతా ల్లోనూ ప్ర‌జ‌ల‌కు త‌మ అజెండానో, మానిఫెస్టోనో తెలియ‌జేడానికి, ఓట‌ర్ల‌ను త‌మ‌వేపు తిప్పుకోవ‌డానికీ పాద యాత్ర‌లు చేప‌డుతున్నారు. వీటికీ రంగుమారి పాద‌యాత్రలే విజ‌య‌ర‌హ‌స్యాలు అన్న అభిప్రా యాలు స్థిరమైనాయి. ఒక్క పాద‌యాత్ర వీల‌యినంత దూరం చేస్తే రాజ‌కీయ‌భ‌విత‌ను మార్చే స్తుంద‌న్న గ‌ట్టి న‌మ్మ కం ఇపుడు రాజ‌కీయ‌పార్టీల అధినేత‌ల నుంచి మామూలు కార్య‌క‌ర్త‌కూ ఏర్ప‌డింది. ఏపీలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు కాపాడేందుకు, వారి ఆశ‌లు ఫ‌లించేలా చేయ‌డానికి, వారి వ్య‌ధ‌ల‌ను తొల‌గించ డానికి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రాన్ని జే గ్యాంగ్ సంకెళ్ల నుంచి త‌ప్పించ‌డానికి ఆయ‌న కంక‌ణం కట్టుకున్నారు. ప్ర‌తీ ప్రాంతంలోనూ ప్ర‌జ‌లు వైసీ పీ పాల‌న ప‌ట్ల విముఖ‌త‌తోనే ఉన్నారు. ఇటీవ‌ల వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం ఘోరంగా విఫ‌లం కావ‌డం అందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌. మూడేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఇద‌మిద్ధం చేసిన మేలు అంటూ ఏమీ లేక‌పోగా హామీలు, ఉప‌న్యాసాలు, బోధ‌న‌లే ఎక్కువ‌య్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అభి వృద్ధి అనేది ఏరంగంలోనూ క‌నిపించ‌డంలేదు. పైగా విప‌క్షాల మీద దుర్భాష‌లాడుతూ విరుచుకు ప‌డ‌టం త‌ప్ప ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమీ లేదు.

 

 

 

ఇది ప్ర‌జ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత బాగా గ‌మ‌ని స్తున్నారు. ప్ర‌శ్నించేవారిపై దాడులు చేప‌ట‌ట‌డం త‌ప్ప సంక్షేమప‌రంగా చేస్తున్న‌దేమీ లేదు.  ఈ ప‌రిస్థితుల్లో, నారా లోకేశ్ పాదయాత్రకు ముహూ ర్తం ఖరారైంది. నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు జనవరిలో శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నిజానికి అక్టోబర్ నుంచే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ మొదట అనుకున్నారు. ఆ దిశగా కొంత కసరత్తు కూడా చేశారు. కానీ అంతర్గత చర్చల తర్వాత ఆ ముహూర్తాన్ని జనవరికి మార్చారు. ఎన్నికల వాతావరణం నెలకొన్నతర్వాత చివరి ఏడాదిలో పాదయాత్ర చేస్తే వ్యూహాత్మకంగా కలిసివస్తుం దని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.వచ్చే జనవరిలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తే ఆపై ఏడాది మార్చి నాటికి మొత్తం 450 రోజుల సమ యం ఉంటుందని టీడీపీ నేతలు లెక్కగట్టారు. 2024 మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉం ది. అప్పటికి రాష్ట్రం మొత్తం పాదయాత్ర పూర్తవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారు.

 

 

రాయలసీమ నుంచి ప్రారంభ మయ్యే లోకేశ్ పాదయాత్ర ఉత్తరాంధ్రలో ముగుస్తుంది. వీలున్నంత వరకూ ఏపీలోని అన్ని ప్రాంతాలనూ లోకేశ్ పాదయాత్ర స్పృశించేలా రూట్ మ్యాప్ను టీడీపీ నేతలు రూపొందిస్తున్నారు.వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు వారంలో రెండు రోజులు విరామం ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరు కావలసి ఉండడంతో ఆ రోజుతో పాటు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకుని ఐదు రోజులు మాత్రమే జగన్ నడిచేవారు. అయితే.. తనకు కోర్టు హాజరు సమస్య లేదు కాబట్టి వారంలో ఏడు రోజులూ పాదయాత్ర చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్ని హితవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి పక్ష నేతగా పాదయా త్ర  చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ పాదయాత్ర చేసిన చివరి ప్రతి పక్ష నేత చంద్రబాబు. జగన్ పాదయాత్ర సమయానికి రాష్ట్రం విడిపోవడంతో ఆయన ఏపీలో మాత్రమే నడిచారు. ఈసారి టీడీపీ తరఫున పాదయాత్ర చేసే అవకాశం లోకేశ్ కు వచ్చింది.ఏపీలో నెలకొన్న వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూర మైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజావ్యతిరేక వైసీపీ పాలనను తూర్పారబట్టేందుకు పాద యాత్రే సరైన సాధనమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా విస్తరిస్తున్నా ఆ స్థాయిలో మరికొన్నిచోట్ల పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరగలేదని, అలా వేగం పెరగడానికి పాదయాత్ర దోహదం చేస్తుం దని అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక తకు ప్రభంజన రూపం తేవాలంటే ఒక చోదకశక్తి అవసరం. లోకేశ్ పాదయాత్ర అలా ప్రభం జనం తీసుకొ స్తుం దని టీడీపీ నేతలు, శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.

 

Tags: Lokesh Padayatra from January 2024

Leave A Reply

Your email address will not be published.