Lokesh Pittukuttu is falling in the tidipeni

టీడీపీనీ ఇరకాటంలో పడేస్తున్న లోకేష్ పిట్టకూత

Date:01/07/2019

విజయవాడ ముచ్చట్లు:

చంద్రబాబు నాయుడి రాజకీయ చతురత, లౌక్యం ఎక్కడా నారా లోకేష్ కి రాలేదు, మంత్రిగా రెండేళ్ళ పాటు ట్రైనింగ్ ఇచ్చినా కూడా రాజకీయం అబ్బలేదు. ఇక పార్టీ దారుణంగా ఓడిన తరువాత కొన్నాళ్ళు మౌనంగా ఉన్న లోకేష్ మళ్ళీ ట్విట్టర్ పిట్టతో కూత పెట్టిస్తున్నాడు. అయితే నారా లోకేష్ చేస్తున్న కామెంట్స్ అన్నీ టీడీపీని ఇప్పుడు ఇరకాటంలో పడేలా చేస్తున్నాయంటున్నారు. జగన్ని ఓ మాట అనబోయి నాలుగు మాటలు తనకూ, తండ్రికీ కూడా అంటించుకుంటున్నాడని తమ్ముళ్ళు గొల్లుమంటున్నారు.తాజా ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని రికార్డ్ స్రుష్టించింది. వైసీపీ విజయం వెనక కోట్లాదిమంది ప్రజల తీర్పు ఉంది. మరి ఇటువంటి లాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినపుడు జనం మోజు ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. దాన్ని గమనించి జాగ్రత్తగా ప్రతిపక్షం మసలుకోవాలి. కొత్త ప్రభుత్వానికి కొంత వ్యవధి కూడా ఇవ్వాలి. అయితే ఇది మరచిపోయి తమ్ముళ్ళు ఓడిన రెండవ రోజు నుంచే విమర్శలు మొదలెట్టేశారు. అది వేరే సంగతి కానీ నారా లోకేష్ మరింత డ్యామేజింగ్ కామెంట్స్ తో వైసెపీ టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఏ వన్, ఏ టూ అంటూ జగన్, విజయసాయిరెడ్డిలపై ట్విట్టర్లో లోకేష్ చేసిన కామెంట్స్ ప్రజా తీర్పుని తప్పుపట్టడమేనని మేధావులు సైతం అంటున్నారు. జగన్ మీద కోర్టులో కేసులున్న సంగతి తెలిసిందే.

 

 

 

 

 

అయితే అవి రుజువు కాలేదు, విచారణ జరుగుతోంది. అయినా సరే ఏ వన్, ఏ టూ అంటూ నారా లోకేష్ అనడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, తీర్పుని కూడా కించపరుస్తున్నారని అంటున్నారు.ఇక వైసీపీ ఇపుడు అధికారంలో ఉంది. మరో వైపు కేంద్రంలో బలంగా మోడీ ఉన్నారు. ఈ సమయంలో కోరి మరీ వైసీపీని కెలికితే నష్టం టీడీపీకేనన్న సంగతి చినబాబు మరచిపోతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. తాను ఇంకా మంత్రినని అనుకుంటూ ముఖ్యమంత్రి మీద దిగజారి మాట్లాడడం ద్వారా నారా లోకేష్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, చినబాబు నిర్వాకాలను విచారించే పనిలో జగన్ బిజీగా ఉన్నారు. ఈ రకమైన మాటలతో రెచ్చగొడితే మరింత దూకుడుగా ఇటు వైపు వైసీపీ బాణాలు దూసుకువచ్చే ప్రమాదం ఉందని తమ్ముళ్ళే అంటున్నారు. ఇక లోకేష్ కామెంట్స్ కి విజయసాయిరెడ్డి గట్టి కౌంటరే ఇచ్చారు. మీ తండ్రి చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలసి మాపై కుట్రలో పెట్టిన కేసులు అవి. కానీ ఇపుడు మీ అవినీతిపై పెట్టబోయే కేసులు మాత్రం చాలానే ఉంటాయంటూ హెచ్చరించారు. మరి చూడాలి లోకేష్ వాచాలత్వం వల్ల బాబుకు మరింత గట్టిగా బిగుసుకుంటుందని తమ్ముళ్ళు అంటున్నారు.

 

బీహార్ లో బడా బాబుల దందా….

 

Tags: Lokesh Pittukuttu is falling in the tidipeni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *