లోకేష్ … మీతాత గురించి చెప్పు- మంత్రి పెద్దిరెడ్డి పేరేత్తే అర్హత లేదు
– పప్పుపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు
పుంగనూరు ముచ్చట్లు:

యువగళం పాదయాత్రలో లోకేష్ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేసిన విమర్శలపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ జింకావెంకటాచలపతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసగించేందుకు లోకేష్ తాత కథ చెప్పడం కాదు. మీతాత ఎన్టీఆర్‌కు మీతండ్రి చంద్రబాబు చేసిన ద్రోహం, ఆయన మరణానికి కారణమేవరో దమ్ముంటే చెప్పాలని నిలధీశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండ చేసేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు గురించి తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పాలనలో రాత్రిపూట రైతులకు కరెంటు ఇవ్వడంతో తాతలు లైట్లు వేసుకుని తిరగడం జరిగిందని, దానిని మార్చి లోకేష్ కథలు చెప్పడం అవివివేకమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గానికి నూరుకోట్లు ఇచ్చామని అపద్దాలు చెప్పే లోకేష్ ఎప్పుడు నిధులు కేటాయించారో తెలపాలని భాస్కర్‌రెడ్డి నిలధీశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు.
కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్లు స్పిప్‌లు ఇస్తే చదవడం కాదు….నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధిపై చర్చకు సిద్దమా అంటు లోకేష్‌ను నిలధీశారు. బైపాస్‌రోడ్డు, ఆర్టీసి డిపో, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులు కమీషన్ల కోసం పనులు రద్దు చేయలేదా అంటు ప్రశ్నించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రెండు ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు వేలాది ఎకరాలు సంపాధించి కోటిశ్వరుడు ఎలా అయ్యాడో లోకేష్ వివరించాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులను ఆదుకున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు విజయడైరీని మూసి హెరిటేజ్ డైరీని అభివృద్ధి చేసుకుని వందలకోట్లు సంపాదించలేదా అంటు నిలదీశారు. పప్పుకు తెలుగు మాట్లాడటం చేతకాక బఫూన్‌లా మాట్లాడుతున్నాడని …సిని నటుడు బ్రహ్మనందం వద్ద శిక్షణ పొందాలని పెద్దిరెడ్డి ఎద్దెవా చేశారు. వెంకటాచలపతి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మంత్రి పెద్దిరెడ్డి తలదించని నేతగా ఎదిగారని చంద్రబాబు కుయుక్తులకు మంత్రి పెద్దిరెడ్డి చెక్ పెట్టారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి నీతినిజాయితీ పరిపాలనను చూసి ప్రజలు ఆయనను పెద్దాయనగా పిలుస్తారని స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి పేరు ఎత్తితే ప్రజలు తగిన గుణపాఠ ం నేర్పుతారని సచివాలయాల కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, దేశొదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, అమరనాథరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శంకరప్ప, రమణ, సుబ్రమణ్యం, రాజశేఖర్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags; Lokesh … tell me about your grandfather – Minister Peddireddy does not deserve to be named
