జగన్ పై లోకేష్ ట్వీట్ 

Lokesh tweet on pics

Lokesh tweet on pics

Date:20/08/2019

గుంటూరు ముచ్చట్లు:

ప్రజా సమస్యలపై ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు మాజీ మంత్రి నారా లోకేష్. జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ఘాటు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా యానిమేటర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ లోకేష్ ఆరోపించారు. ఉద్యోగుల కష్టాలను తెలియజేస్తూ ఓ వీడియోనను ట్వీట్ చేశారు. చిరు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదేం న్యాయమంటూ ప్రశ్నించారు.‘అనగనగా ఒక శాడిస్టు బాస్, ఉద్యోగిని పిలిచి నీకు జీతం రెట్టింపు చేశా అన్నాడట.

 

 

 

 

 

అతను సంతోషిస్తూ కృతజ్ఞతలు చెబుతుంటే, నీకింకో విషయం చెప్పాలి, నిన్ను ఉద్యోగం నుంచి తీసేసా’ అన్నాడట. మరలాంటప్పుడు నాకు జీతం ఎందుకు పెంచారు’ అని అడిగితే ఉద్యోగం పోయిన బాధ నీకు రెట్టింపు చేయడానికి అన్నాడట’అంటూ ఎద్దేవా చేశారు. ‘జగన్ గారు కూడా అదే చేస్తున్నారు. యానిమేటర్లకు జీతం పదివేలు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కనీసం ఒక్క నెలయినా పెరిగిన జీతం ఇవ్వకుండా గ్రామ వాలంటీర్లను వారి మీదికి పంపి మీ ఉద్యోగాలు ఊడపీకారు పొమ్మంటున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి పది ఉద్యోగాలు పీకడం… ఏంటీ అన్యాయం జగన్ గారూ?’ అంటూ ప్రశ్నించారు.

మరో దశను పూర్తి చేసుకున్న చంద్రయన్

Tags: Lokesh tweet on pics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *