ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హజరయిన మంత్రి లోకేష్

Lokesh who is attending the World Economic Summit

Lokesh who is attending the World Economic Summit

Date:18/09/2018
బీజింగ్ ముచ్చట్లు:
వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎపి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హియర్ టెక్నాలజీస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీ ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యారు. అక్టోబర్లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్లో పాల్గొనాలని వారిని లోకేశ్ ఆహ్వానించారు. ఎపిలో పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోవాలని వారిని  కోరారు. ఆ సంస్థ మ్యాప్ కంటెంట్,ట్రాకింగ్,లొకేషన్ సర్వీసెస్,ఐటీ సర్వీసెస్ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం బెంగుళూరు లో హియర్ టెక్నాలజిస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం ఐటీ హబ్ గా మారుతుంది. ఫ్రాంక్లిన్ ,కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీ లు విశాఖపట్నంకి వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యం ఉన్న యువతి,యువకులు ఉన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తియ్యడానికి ప్రతి నెలా హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నాం .
ఇన్నోవేషన్ ని వే ఆఫ్ లైఫ్ గా (నూతన ఆవిష్కరణలు జీవితంలో ఒక భాగంగా)మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. కంపెనీ విస్తరణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి అని  లోకేష్ కోరారు.
అక్టోబర్ లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్ లో పాల్గొనాలి అని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చి జరుగుతున్న అభివృద్ధి చూసిన తరువాత ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. మెలోడీ మాట్లాడుతూ త్వరలోనే ఏపీ కి వస్తాం. కంపెనీలో చర్చించిన తరువాత పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Tags:Lokesh who is attending the World Economic Summit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *