బీజేపీ దీక్ష పై ట్విట్టర్ లో స్పందించిన లోకేష్

Lokesh who responded to Twitter on the BJP initiative

Lokesh who responded to Twitter on the BJP initiative

Date:22/10/2018
అమరావతి ముచ్చట్లు:
దొంగే దొంగ…దొంగ అని అరిచినట్టు బీజేపీ నేతలు దీక్ష చేసారు. నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా నుండి తిత్లీ తుఫాను సహాయం వరకూ ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగం కాదు అన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ అగ్రిగోల్డ్ అంటూ కొత్త కుట్రకి తెరలేపిందని అయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ అంశంలో బాధితులకు న్యాయం చెయ్యాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు  కృషి చేస్తున్నారు. కోర్టులను కించపరుస్తూ బీజేపీ నేతలు ఆరోపణలు చెయ్యడం మాని,ఆధారాలు ఉంటే బయట పెట్టాలి.చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసారు.
Tags:Lokesh who responded to Twitter on the BJP initiative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *