లోకేష్ మృతదేహం లభ్యం

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:

శుక్రవారం  ఉదయం ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం ప్రాంతంలో దురదృష్టవశాత్తు నీట మునిగిన కొండపల్లి ప్రాంతానికి చెందిన దొప్పలపూడి లోకేష్ అనే బాలుడి మృతదేహం విజయవాడ ప్రకాశం బ్యారేజీ 55వ గేటు వద్ద లభ్యం అయింది.   బాలుడు ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్  సిబ్బంది, మత్స్యకారులు ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది.  బాలుడి మృతదేహం ప్రకాశం బ్యారేజీ 55వ గేటు వద్ద బయటపడటంతో  విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం సిఐ శ్రీను, సిబ్బంది వచ్చి  లోకేష్ మృతదేహం వెలికి తీసారు.

 

Tags: Lokesh’s dead body found

Leave A Reply

Your email address will not be published.