ఉల్లిపై లొల్లి

Lollie onion

Lollie onion

Date:07/12/2019

విశాఖపట్నం ముచ్చట్లు:

ఉల్లిధరలు నియంత్రణపై విశాఖలో ప్రజా సంఘాలు నిరంతరంగా నిరసను కొనసాగిస్తున్నాయి. ఉల్లికి బంగారానికి తూకం వేసి సిపిఎం నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేజీ ఉల్లి కొనాలంటే మండిపోతున్న ధరలతో సామాన్య ప్రజలు గంటల కొద్ది నిరీక్షించాల్సిన పరిస్ధితి వచ్చిందని సిపిఎం నేతలు ఆందోళణ వ్యక్తం చేశారు.సెంచురీని దాటి పరుగులు పెడుతున్న ఉల్లి దరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాల్పిన ప్రభుత్వం ప్రైవేట్ మార్కెట్ వ్యక్తులతో కుమ్మక్కై ఉల్లి కుత్రిమ కొరను సృష్టిస్తున్నారని ఆరోపించారు.ముఖ్యంగా విశాఖ లాంటి మహానగరంలో రోజుకు వందల టన్నులు అవసరమేతే కేవలం 10 టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నాయని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉల్లి దరలను నియంత్రించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారం

 

Tags:Lollie onion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *