తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు

తిరుచానూరు ముచ్చట్లు :

 

 

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుండి 24వ తేదీ వరకు ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.ఈ 5 రోజుల‌ పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకు ఉత్స‌వ‌మూర్తుల‌కు తిరుమంజ‌నం(అభిషేకం) చేపడతారు. జూన్ 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తుకు అభిషేకం నిర్వహిస్తారు. తెప్పోత్స‌వాల కార‌ణంగా ఈ 5 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం ర‌ద్ద‌యింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Lonely Theppotsavalu at Sri Padmavati Ammavari Temple, Thiruchanur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *