Natyam ad

అభివృద్ధి చూసి ఆదరించండి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ కోరారు. బుధవారం ఆయన పట్టణంలోని రహమత్‌నగర్‌, యూబికాంపౌండులో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే పట్టణంలోని టైలర్ల సంఘ నాయకులు ఖాసీమ్‌, నరసింహులు, సూరి, అస్లాం, మురేష్‌ల ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో ప్రచారాలు నిర్వహించారు. అలాగే పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు ప్రభాకర్‌, శివ, శరణ్‌, సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, త్రిమూర్తిరెడ్డి, ఆవుల హరిప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డి, పి.ఎల్‌.శ్రీధర్‌, కృష్ణప్ప, శ్రీనివాసులు, నానబాలగణేష్‌, రెడ్డెప్ప, ఆర్‌కె.రామకృష్ణ, డాక్టర్‌ రమణరావు, బిటి.అతావుల్లా ,రామచంద్ర లు కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే కుమ్మరవీధిలో కౌన్సిలర్‌ రేష్మా, మైనార్టీ నాయకులు అస్లాంమురాధి, మమ్ము, నిజాం ప్రచారం చేశారు. మే 13న జరగబోవు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని , రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ ప్రచారాలలో టైలర్లు బషీర్‌, అహమ్మద్‌, శ్రీనివాసులు, ఇస్మయిల్‌, నిజాముద్దిన్‌, జావీద్‌, కరీష్మ, రాజా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Look forward to the development

Post Midle